మహిళతో సహ ఇద్దరు గంజాయి స్మగ్లర్లపై పీడీ యాక్ట్
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 17(జనం సాక్షి)
గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న మహిళతో సహ ఇద్దరు నిందితులపై శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి పీడీ యాక్ట్ ఉత్తర్వులు జారీ చేసారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో పరిధిలో గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ఒడిషా రాష్ట్రానికి చెందిన తబ్బతీయా బీషోయి, కామిని నాయక్ పై వరంగల్ పోలీస్ కమిషనర్ జారీ చేసిన పీడీ యాక్ట్ ఉ త్తర్వులను మీల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ముస్కా శ్రీనివాస్ చర్లపల్లి, చంచల్ గూడలో కారాగారాంలో వున్న నిందితుల కు జైలర్ సమక్షంలో అందజేసారు.
పీడీ యాక్ట్ అందుకున్న నిందితులు ఇద్దరు ఆంధ్ర ఒడిషా సరిహద్దు ప్రాంతంలో తక్కువ మొత్తం గంజాయి కోనుగోలు ట్రైన్ ద్వారా వరంగల్ కమిషనరేట్ పరిధిలోని విక్రయించేవారు. ఇదే రీతిలో గత ఏప్రిల్ నెల 5వ తేదిన నిందితులు ఇద్దరు వరంగల్ రైల్వే స్టేషన్ నుండి శివనగర్ వైపు వెళ్ళుతుండగా అప్పుడే పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు నిందితులు అనుమానస్పదంగా కనిపించడంతో నిందితులను తనీఖీ చేయగా నిందితుల వద్ద గంజాయి గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడూతూ చట్టవ్యతిరేక కార్య కలపాలకు పాల్పడే వ్యకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు వారిపై పీడీయాక్ట్ క్రింద కేసులు నమోదు
చేయబడుతాయని వరంగలసి పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.