మహిళలకు భద్రత కల్పించడంలో విఫలమైన ప్రభుత్వాలు -మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు మామిళ్ల పద్మ

 

మహబూబాబాద్  -జూలై29(జనంసాక్షి)

అఖిల భారత మహిళా సమాఖ్య గార్ల మండల రెండవ మహసభలు మండల కేంద్రం లోని స్థానిక సీపీఐ కార్యాలయం నల్లమల గిరిప్రసాద్ భవనంలో సిరిమర్ధి వెంకట నర్సమ్మ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మామిళ్ల సమలక్ష్మి, జిల్లా అధ్యక్షురాలు మామిళ్ల పద్మ లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు మహిళలకు భద్రత కల్పించడంలో విఫల మయ్యాయని దుయ్యబట్టారు. ఎక్కడ చూసినా మహిళల పై చిన్నారులపై లైంగిక దాడులు నిమిషానికి ఒక్కటి చొప్పున జరుగుతూనే ఉన్నాయన్నారు. మహిళల పై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా మహిళలు అంతా ఏకమై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నూతన మండల జాతీయ మహిళా సంఖ్యను ఎన్నుకున్నారు. గార్ల మండల మహిళ సమాఖ్య కార్యదర్శిగా సిరిమర్ధి.వెంకటనర్సమ్మ, ఉపద్యక్షురాళ్లుగా ఈశ్వరమ్మ,సింధు రాజ్యలక్ష్మి, సహాయ కార్యదర్శులుగా గట్టు జ్యోతి,మంజు భాగ్యలక్ష్మి, లను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి జంపాల. వెంకన్న, ఈశ్వరమ్మ,మంగమ్మ, వనమ్మ,మంజు, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు