మహిళలపై ప్రపంచీకరణ ప్రభావం

ఏ సమాజంలోనైనా ఉనికిలో ఉన్న సామాజిక ,ఆర్థిక రాజకీయ సాంస్క్రృతిక నిర్మాణాలే అక్కడి ప్రజల జీవన స్థితిగతుల నిర్ణయిసా ్తయి.వీటికి తోడు అస్తిత్వంలో ఉన్న పితృస్వామ్యం కూడా కలిసి స్త్రీలకు జీవితాలను నిర్ధారిస్తుంది.అందువల్లనే ఈ నిర్మాణాల ను ప్రభావితం చేసే ఏ అంశమైనా మహిళలపై ప్రత్యేక ప్రభావం చూ పుతుంది.అంటే ప్రతి అంశానికి జెండర్‌ కోణం ఉంటుంది.ఈ దృష్ట్యా పరిశీలించినప్పుడు భారత దేశం మీద ప్రపంచీకరణ కలు గజేసే ప్రభావానికి జెండర్‌ కోణం ఉంటుంది.ట్రికిల్‌ డౌన్‌ సిద్దాంతా నికి వ్యతిరేకంగా అభివృద్ధి ఫలితాలు వాటంతటఅవే మహిళలకు అందవన్నది చారిత్రక సత్యం.కానీ సంకిష్ట పరిస్థితులు ఏర్పడిన ప్పుడు వాటి దుష్పలితాలకు స్త్రీలు బలికావడం సర్వసాధార ణం.ఇందుకు సస్తిత్వంలో ఉన్న పితృస్వామిక సూత్రాలు ,నీయమా లు,భావాజాలం ఒక బలమైన నెట్‌వర్క్‌గా పనిచేస్తాయి.ఈ నేపథ్యం లో భారత దేశ సామాజికార్థిక ,సాంస్క్రృతిక నిర్మాణాలను ప్రపంచీ కరణ ఏవిధంగా ప్రభావితం చేసింది? అది పితృస్వామిక సూత్రా లను ,భావాజాలాన్ని మరింత బలపరిచిందా?బలహీన పరిచిందా? అన్న అంశాల మీద భారత దేశ మహిళలపై ప్రపంచీకీకరణ ప్రభావం ఆదార పడి ఉంటుంది.1980 దశకం చివరి భాగంలో భారత దేశంలో ఆర్థిక సంక్షోభం పరికాష్ట దశకు చేరుకుంది.ఈ సమస్యకు పరిష్కారం ప్రపంచీకీకరణ మాత్రమేనని ,ఇందుకు ప్రత్యామ్నాయం మరేది లేదని వాదన బలంగా ముందుకు వచ్చిం ది.ప్రభుత్వ రంగం ,ప్రభుత్వ జోక్యం అజమాయిషీ లతో విసిగిపో యిన ప్రజలకు గ్లోబలైజేషన్‌ ఒక సమర్థకవంతమైన ప్రత్యామ్నా యంగా కనిపించింది.1990-91 లలో నూతన ఆర్థిక విదానం పేరిట ప్రపంచీకరణ భారత దేశంలోకి ప్రవేశించినప్పుడు దానికి వ్యతిరేకిత అంత బలంగా ఏమీ అనిపించలేదు.వామ పక్షాల నుంచి మాత్రం కొద్ది నిరసన వినిపించింది.కానీ గ్లోబరైజేషన్‌ స్థిరపడి ,బలపడే కొద్ది దాని దుష్పరిణామాల ప్రభావానికి మెజారిటీ ప్రజలు గురికావడమే ప్రక్రియ అధికమైనది.గ్లోబరైజేషన్‌ వల్ల భారత దేశ ఆర్థిక వ్యవస్థ ఒక సమర్థవంతకమైన ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంటుందనుకున్న ప్రజల ఆశ ఎందుకు భగ్నమైంది. అన్నది పరిశీలించవలసిన విషయం.సంక్షిప్తంగా చెప్పాలంటే ప్రైవ ేటీకరణ ,వాణిజ్యీకరణ ,సరళీకరణలతో ప్రపంచీకరణ ముడిప డి ఉంటుంది.అంతేకాకుండ ఇవి ఒక దానిని మరొకటి బలొపేతం చేసుకుంటాయి.ఈ క్రమం గుత్తాదిపత్యాన్ని ,బహుళ జాతి సంస్థల ఆదిపత్యాన్ని బలోపేతం చేస్తుంది.ప్రభుత్వ గుత్తాది పత్యం స్థానంలో ఏర్పడిన ప్రైవేటు గుత్తాదిపత్యం ఏవిధంగా మెరుగైంది అన్నది ప్రధాన ప్రశ్న.పైగా ప్రైవేటు గుత్తాదిపత్యాన్ని ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమైంది.కాబట్టి అందుకను కూలమైన విధానాలను ప్రభుత్వం రూపొందిస్తుం ది.పారిశ్రామిక లైసెన్సులను రద్దు చేయడం ,ఎంఆర్‌టీపీ చట్టాన్ని ,ఫెరా చట్టాన్ని బలహీన పరచడం ఇందులో భాగమే ఈ విధానాలు భారత దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలాం టి ప్రభావాన్ని కలుగజేశాయి?దాని ఫలితంగా మహిళల జీవితా లలో విచ్చిన మార్పేమిటీ?వంటి అంశాలు పరిశీలించా లి.ప్రపంచీకీకరణ విస్తరణను వేగవంతం చేస్తున్న అంతర్జాతీయ సంస్థలు మూడు అవి – అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌), ప్రపంచబ్యాంకు (ఐబిఆర్‌), ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటిఓ) ఈ మూడు సంస్థలను అదుపు చేస్తున్నది గ్రూప్‌ ఆఫ్‌ 7గా గుర్తింపు పొందిన సంపన్న దేశాల కూటమి. అందువల్లనే ఈ దేశాల ప్రయోజనాలకు అనుగుణంగానే ఈ విత్త సంస్థల విధానాలుం టాయి. దారిద్య్ర రహిత సమాజ స్థాపన లక్ష్యంతో ఐఎంఎఫ్‌, ఆర్థిక స్థిరత్వాన్ని సాధించే లక్ష్యంతో ప్రపంచ బ్యాంకు ఉనికిలోకి వచ్చాయి. కాని గ్లోబలైజేషన్‌ క్రమానిన విస్తరించడానకి అవి అవలంభిస్తున్న విధానాలు వర్ధమాన దేశాలలో దారిద్య్ర తీవ్రతను, ధనికులు-పేదల మధ్య అంతరాన్ని ఆర్థిక వ్యవస్ధలలో అస్థిరతను పెంచుతుంది.యుఎన్‌డిపి,యుఎన్‌ఐడిఒ, బైనేఫెల్డ్‌, ప్రంపచబ్యాంకు అది óపతిగా పనిచేసిన జోసెఫ్‌ స్టిగ్లిట్జ్‌ నిర్వహించిన అధ్యయనాలు, వర్థమాన దేశాలలో పేద రికం తీవ్రమవుతున్నదన్న అంశాన్ని ధృవపరిచాయి. దీనినే గ్లోబలైజేషన్‌ ఆఫ్‌ పావర్టీగా మైఖెల్‌ ఛాసుకడోవస్కీ అబి óవర్ణించాడు. ఇందులో భాగంగానే భారత దేశ పరిస్థితి ఉంటుంది. అంటే భారత దేశంలో కూడా నిరపేక్ష పేదరికం, సాపే క్ష పేదరికం అధికమైనాయి. ఖచీణూ రూపొందించిన మానవాభివృద్ది నివేదిక 1995 ప్రకారం పేదరికానికి స్త్రీ ముఖం ఉంది. అంటే పేదరికంలో జీవిస్తున్న ప్రజలలో 70 శాతం మంది మహిళలే. ఈ ధోరణినే, ఫెమినైజేషన్‌ ఆఫ్‌ పావర్టీగా పేర్కొనడం జరుగుతు న్నది. పురుషులతో పోల్చినప్పుడు సంఖ్యాపరంగా సాపేక్షికంగా ఎక్కువ మంది :మహిళలు పేదరికంలో మగ్గిపోవడం ఒక అంశమె ౖతే పితృస్వామిక విలువల అమలులో ఉండడంవల్ల పేదరికం భారం తీవ్రత మహిళలపైనే అధికంగా ఉడడం మరొక అంశం. పితృస్వామిక కౌటుంబిక సూత్రాలు, ప్రధానంగా కుటుంబంలోని సంపద, వనరులు ఎవరి ఆధినంలో ఉంటాయి? ఇంటిపని, పంపిణీని, వినియోగం తీరును నిర్ణయించే సూత్రాలు సహజంగానే పురుష ప్రయోజనాలకు,పెత్తనానికి, ఆధిపత్యానికి అనుకూలంగా ఉంటాయి. స్త్రీల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉంటాయి. ఇక పేద కుటుంబాలలో మహిళల మీద పని ఒత్తిడిని ఇవి అధికం చేస్తాయి. పితృస్వామిక కుటుంబాలలో ఇంటిల్లిపాదికి ఆహార భద్రతను కసమకూర్చవలసిన బాధ్యత పూర్తిగా స్త్రీల బాధ్యతనే. అందుకోసం మహిళ నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. అవి సంపాదన పనులు కావచ్చు, సంపాదన లేని పనులు కావచ్చు. మొత్తం మీద మహిళ తన గురిచీ ఆలోచించు కోకుండా కుటుంబానికి ఆహార భద్రతను సమకూర్చే లక్ష్యంతో శ్రమిస్తూనే ఉంటుంది. వంట చెరుకును తెస్తుంది. అడవిలోని పండ్లను, కాయగూరలను తెస్తుంది. కోళ్లను, పాడి పశువులను పోషిస్తుంది. ఎక్కడి నుండో నీళ్లను మోసుకొస్తుంది. ఇంటిపెరడులో కాయగూరలు పిండిస్తుంది. ఇంటి నిర్వహణకు సంబందించి నపనులిన్నీంటిని విశ్రాంత అనేది లేకుండా చస్తూనే ఉంటుంది. అపారమైన ఉపయోగిత విలువ ఉన్న ఈ పనులన్నీ స్త్రీ చేయడం వల్లనే కుటుంబాల మనుగడ సాధమవుతోంది. బాధ్యతల నిర్వహణే బలహీనతగా పరిగణించే సామాజిక సూత్రాలు అమలులో ఉండడం వల్ల కుటుంబ మనుగడకే కారణమైన, ఆధారమైన మహిళ ఆధీనత్వ స్ధితిలో ఉండడం ఒక సీరియస్‌ వైరుధ్యం. యుఎస్‌డిపి ప్రచురించిన ‘మానవా భివృద్ది నివేదిక, 2006’ ను అనుసరించి వర్ధమాన దేశాలలో అందులో బాగంగా భారతదేశంలో వంటచెరకు కొరత, నీటి కొరత రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. జెండర్‌ ఆధారిత శ్రమ విభజన దృష్ట్యా ఈ రెండు పనులను నిర్వహించవలసిన బాధ్యత స్త్రీదే. వంటచెరుకును, నీళ్లను సమీకరించడం కోసం స్త్రీలు రోజుకు 5-6 గంటల సమయం కేటాయించవలసి వస్తున్నది. మానవులు తమ శక్తులను అభివృద్ది పరుచుకొడానికి సమయం అనేది ఒక ముఖ్కమైన వనరు. నీటికొరత వల్ల ఈ మహిళలు ఆదాయ పేదరికానికి తోడు సమయ పేదరికాన్ని ఎదుర్కొంటు న్నారు. ఫలితంగా మహిళలకు తమ నైపుణ్యాకలను పెంచుకోవ డానికి, శక్తులను వినియోగించుకు ఓవడానికి అవకాశమే ఉండదు. ఈ విధంగా పేదరిక భారం మహిళల మీద తీవ్రంగానే ఉంటుంది. ఇది మహిళల అభివృద్దిని సీరియస్‌గా ఆటంక పరుస్తోంది. ఇట్లా భారతదేశంలో విస్తరిస్తున్న ప్రపంచీకరణ క్రమం ఫలితంగా పెరిగిన పేదరికం మహిళల జీవితాలను దర్భరం చేస్తోంది. వాళ్ల ఎదుగుదలకు సీరియస్‌ ప్రతిబంధకాలను సృష్టించిం ది.సామా జికాభివృద్దికి దోహదపడే అఈంశాలలో స్త్రీ విద్య కీలక మైంది. వ్యక్తి స్వేఛ్చకు, అభివృద్ది ప్రక్రియక వ్యూహత్మకమైన అంశం, యుఎన్‌డిపి రూపొందించే మానవాభివృద్ది నివేదికలోని జెండర్‌ అభివృద్ది సూచికకు మహిళా అక్షరాస్యత ఒక ప్రాతిపదిక. సమాజాన్ని మనవీయం చేసుకోవడానికి 2000లో యుఎన్‌ఒ రూపొందించిన మిలీనియం అభివృద్ది లక్ష్యాలు 2015 నాటికి సంపూర్ణ మహిళా అక్షరాస్యతను సాధించాలని నిర్దేశించాయి. కాని ప్రస్తుతం వయోజన మహిళా అక్షరాస్యతను సాధించాలని నిర్ధేశిం చాయి. కాని ప్రస్తుతం వయోజన మహిళా అక్షరాస్యత 60 శాతాన్ని మించలేదు. అంతేకాకుండా ఖచీణూ సమీక్ష ప్రకారం బడికి వెళ్లవలసిన ఆడపిల్లలు బడికి వెళ్లలేని ప్రస్తుత పరిస్ధితుల ప్రకారం 2040 వరకు కూడా భారతదేశంలో సంపూర్ణ మహిళా అక్షరాస్య తను సాధించడం దుర్బరమే. కేవలం అక్షరాస్యత స్త్రీల సామాజిక అవసరాలనను ఎంతమేరకు మెరుగుపరుస్తాయనేది సందేహం. పైగా ఈ తక్కువస్థాయి అక్షరాస్యతలో కూడా కుల ప్రాతిపదికగా, గ్రామీణ – పట్టణ ప్రాంత వ్యత్యాసాలున్నాయి. అట్టడుగుస్థాయిన ఉన్నది గ్రామీణ దళిత మహిళ అని నిస్సందేహంగా చెప్పవచ్చు. విద్య, వైద్య రంగాలు ప్రభుత్వ నియంత్రణలో ఉన్నప్పుడే అవకాశాల విస్తరణ పాధ్యమవుతుందని జీన్‌ డ్రెజ్‌, అమర్త్యసేన్‌ అభిప్రాయ పడ్డారు. కాని భారతదేశంలో ప్రపంచీకరణ ప్రభావానికి అంటే ప్రైవేటీకరణకు ముందు లోనైంది. విద్యారంగమే, ప్రపంచీకరణ ప్రభావం వల్ల విద్యా రంగం నుండి ప్రభుత్వం వైదొలుగుతూ ప్రైవేటురంగ విస్తరణకు అవకాశం కల్పించింది. లాభార్జన లక్ష్యం గా ప్రైవేటు విద్యాసంస్ధల విస్తరణలో విద్య ఒక వ్యాపార వస్తువైంది. అవి వసూలు చేసే ఫీజులను పేదవర్గం భరించడం అసాధ్యమ వుతోంది. అటువంటప్పుడు ఆ కుటుంబాలు త్యాగం చేసేది ఆడపిల్ల చదువునే. దీనితోపాటు రోజురోజుకు పెరుగుతున్న వరకట్న సమస్య ఆడపిల్లల చదువుకు పెద్ద అవరోధం గా నిలుస్తుంది. ఒకవైపు ఇంజనీరింగ్‌, వైద్య విద్యలలో అడపిల్లఉ కూడా ప్రవేశించడం కనిపిస్తుంది. సీట్లలో మహిళలకు 33 శాతం ప్రాతిన ధ్యం ఉండడం వల్ల ఈ కోర్సులు ఎక్కువ మంద ఆడపిల్లల కు అందుబాటులోకి వస్తున్నట్లు గమనించవచ్చు. ఇది ఆహ్వానించ దగిందే కాని కేవలం 4 శాతం మమిళలకు మాత్రమే ఉన్నత విద్య ను అభ్యసించే అవకాశాలు వస్తున్నాయి. కాని గ్లోబలైజేషన్‌ పెంచిన పేదరిక తీవ్రత ఒక వైపు, విద్యారంఒగంలో ఆధిపత్యం కలిగిన ప్రైవేటు సంస్థలు వసూలు చేసే అధిక ఫీజులు మరొక వైపు స్త్రీలకు విద్యను అందకుండా చేస్తున్నాయి.
– తోట జ్యోతిరాణి
(తరువాయి భాగం రేపటి సంచికలో..)