మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి
-తొర్రూరు జడ్పిటిసి మంగళపల్లి శ్రీనివాస్
తొర్రూరు 6 సెప్టెంబర్ (జనంసాక్షి )
మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని జెడ్పి ఫ్లోర్ లీడర్,తొర్రూరు జెడ్పిటిసి మంగళపల్లి శ్రీనివాస్ అన్నారు. గ్రామీణ జీవనోపాధి మిషన్
ద్వారా తొర్రూరు కేంద్రంలోని మదర్ థెరిస్సా మండల సమాఖ్య అద్వర్యంలో శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలు అభివృద్ది బలమైన సంఘటిత శక్తి కి నిదర్శనం అన్నారు.జీవనోపాదుల అభివృద్ధిలో 18 మండలాల్లో తొర్రూరు మండలం 3వ స్టానంలో నిలిచిందని,గ్రామీణ ప్రాంతంలో 45 గ్రామైక్య సంఘాల్లో సుమారు 6 వేల మంది పై చిలుకు మహిళలు ఉన్నారని అన్నారు.మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచనల మేరకు జిల్లా అధికారులు తొర్రూరు మండలాన్ని జీవనోపాదుల అభివృద్ధికై ఎంపిక చేయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.ఆహారపు ముడి సరుకులను సేకరించి (ఆహారపు ఉత్పత్తుల్ని ) ఎక్స్ పోర్ట్ చేసి గిట్టుబాటు ధరలు పొందాలని కోరారు. అనంతరం మండల సమైక్య పాలకవర్గం, ఏపీఎం, సీసీలు,విఓలను అభినందించారు. ఈ సందర్భంగా అన్ని రంగాల్లో ఉత్తమ సేవలందించిన గుర్తురు వివోఏ రజిత ను సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ కో అప్షన్ ఎస్.కె.అంకూస్, ఏపిఎం వరదయ్య, సీసీ లు ఉషా రాణి, పద్మావతి, ఉమారాణి, వెంకటయ్య, రేణుక తదితరులు పాల్గొన్నారు.
Attachments area