మహిళలు పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలి..
సర్పంచ్ స్వప్న తిరుపతి
శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 28
మహిళలు పౌష్టిక ఆహారాన్ని తీసుకొని, ఆరోగ్య సిబ్బంది ,ఐసిడిఎస్ సిబ్బంది సూచనలను పాటించి, ఆరోగ్యంగా ఉండి పండంటి బిడ్డలకు జన్మనివ్వాలని, కేశవపట్నం సర్పంచ్ బండారి స్వప్న తిరుపతి మహిళలకు సూచించారు. బుధవారం మండలంలోని కేశవపట్నం గ్రామంలో మహిళా శిశు సంక్షేమ శాఖ, ఐసీడీఎస్ అంగన్వాడి ఆధ్వర్యంలో పోషణ్ మాసం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సర్పంచ్ స్వప్న తిరుపతి మాట్లాడారు. మహిళలు పౌష్టికంగా ఉండేందుకు పోషణ ఆహారాన్ని తీసుకొని పటిష్టంగా ఉండాలని, ఐసిడిఎస్ సేవలు వినియోగించుకొని పోషక ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. ఐసిడిఎస్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు సీమంతం, చంటి పిల్లలకు అన్న ప్రసన్న, చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ రాజశ్రీ, టీచర్లు కమలాబాయి, పద్మ కుమారి,సుమలత ,సోనీ , ఆయాలు గర్భిణీ స్త్రీలు చంటి పిల్లల తల్లులు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.