మహిళల ప్రాణాలతో చెలగాటం దుర్మార్గం: చర్యకు పి కళావతమ్మ డిమాండ్

వనపర్తి :ఆగస్టు 29 (జనం సాక్షి) ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి ఇద్దరు మహిళల మృతి ఒకరి ప్రాణాపాయ స్థితి కి కారకులైన,సూర్యాపేట మాతా శిశు కేంద్రంలో వందమంది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసి నేలపై పడుకోబెట్టిన వైద్యులపై కఠిన చర్య తీసుకోవాలని భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షులు పి కళావతమ్మ డిమాండ్ చేశారు గతంలో వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి కాన్పుకు వచ్చిన ఇద్దరు మహిళలు ఒక పసిబిడ్డ మృతి చెందిన సంఘటన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు సోమవారం సూర్యాపేట ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రుల్లో ఒకేరోజు జరిగిన రెండు వేరువేరు సంఘటనలపై ఆమె స్పందించారు ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో మాడుగుల మండలం నర్సాయిపల్లికి చెందిన మమత మంచాల మండలం లింగంపల్లి కి చెందిన సుస్మిత ఇబ్రహీంపట్నం పరిధి సీతారాంపేట కు చెందిన లావణ్య ఈనెల 25న కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకుని ఇళ్లకు వెళ్లారని అక్కడ వారు తీవ్ర అస్వస్థతకు గురికాగా ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారని వైద్యం పొందుతూ ఆది వారాలలో మమతా సుష్మ మరణించారని తెలిపారు లావణ్య చావుతో పోరాడుతున్నదని తెలిపారు ఇదిలా కొనసాగుతుండగానే సూర్యాపేట మాతా శిశు కేంద్రంలో మరో దారుణం చోటు చేసుకుందని తెలిపారు సూర్యాపేట మాతా శిశు కేంద్రంలో మహిళలకు లేప్రోస్కోపిక్ ఆపరేషన్లు నిర్వహించారని తెలిపారు బెడ్లు లేవని నేలపై పడుకోబెట్టి కష్టాలు తీవ్ర అసౌకర్యం కలిగించారని విమర్శించారు పేద మధ్యతరగతి మహిళలే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తారని వారిని ఇంత హీనంగా చూడటం దుర్మార్గమని విమర్శించారు ప్రభుత్వాసుపత్రులు కార్పొరేట్ ఆసుపత్రులకు తీసిపోవని ప్రభుత్వం గొప్పలు చెబుతుందని కానీ అక్కడ వైద్యం దయనీయ ప్రమాదకర స్థితిలో ఉందని ఈ సంఘటనలు తెలియజేస్తున్నాయని వాపోయారు ఇది ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం అని ఆరోపించారు కాగా వనపర్తి ప్రభుత్వాసుపత్రిలోనూ గతంలో ఇటువంటి సంఘటనలు జరిగాయని తెలిపారు పానగల్ మండలం కేతేపల్లి గ్రామానికి చెందిన తెలుగు జ్యోతి తొలి కాన్పు నిమిత్తం పానగల్ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో చేరగా కాన్పు జరుగుతుందని వైద్యులు అట్టిపెట్టుకున్నారని కాన్పు జరిగి శిశువు మరణించిందని ప్రాణాపాయ స్థితిలో ఉన్న తల్లిని వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించగా అక్కడ మరణించిందని తెలిపారు దీనిపై జిల్లా కలెక్టర్ విచారణ కు ఆదేశించారని పానగల్ ఆసుపత్రిలో ఇటీవల విచారణ జరిగిందని ఇంకా చర్యలేదని తెలిపారు అలాగే గతంలోనూ బోయ జ్యోతి అనే మరో మహిళ వనపర్తి ఆస్పత్రిలో కాన్పానంతరం మరణించిందని బిడ్డ మాత్రం బతికాడని తెలిపారు శవంతో ఆసుపత్రి ముందు ధర్నా చేయగా అన్యాయం చేస్తామని ఆస్పత్రి వర్గాలు నమ్మబలికి పంపారని వారికి సాయం చేయకపోగా న్యాయం కూడా జరగలేదని తెలిపారు బాధ్యులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు న్యాయం కోసం ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం దక్కలేదన్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న సంఘటనలను ప్రభుత్వం పాఠాలుగా తీసుకోవడం లేదని ఆరోపించారు తాజాగా జరిగిన సూర్యపేట ఇబ్రహీంపట్నం సంఘటనలే ఉదాహరణలని తెలిపారు వనపర్తి సంఘటనపై చర్య తీసుకోవాలని అలాగే సూర్యాపేట ఇబ్రహీంపట్నం సంఘటనలపై విచారించి ఇందుకు బాధ్యులైన అధికారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఇటువంటి సంఘటనలు ప్రభుత్వాసుపత్రుల్లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకొని ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకాన్ని పెంచాలని డిమాండ్ చేశారు అన్ని సౌకర్యాలు ఆసుపత్రుల్లో కలిగించాలని కోరారు