మహిళా దొరసాని రిజర్వేషన్ బిల్లు ధర్మసమాజ్ పార్టీ బాల్కొండ మండల కమిటీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం

మహిళా దొరసాని రిజర్వేషన్ బిల్లు ధర్మసమాజ్ పార్టీ బాల్కొండ మండల కమిటీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం

 

బాల్కొండ సెప్టెంబర్ 23 (జనం సాక్షి ) నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో డా. విశారాధన్ మహారాజ్ ఆదేశాలు మేరకు వన్నెల్ బీ చౌరస్తా వద్ద 33%మహిళ రిజర్వేషన్లు 90 శాతం బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకు ఉపకోట కేటాయించాలని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి,మహిళ రిజర్వేషన్ బిల్లు దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.ఈ సందర్భంగా ధర్మ సమాజ్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ మహిపాల్ మహారాజ్, మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లులో 93% బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకు ఉపాధి కోట కేటాయించాలన్నారు ఒకవేళ ఎలా జరగకపోతే అగ్రవర్ణ దొర పోయి దొరసాని పార్లమెంట్, అసెంబ్లీలో కి ప్రవేశిస్తారని అన్నారు.దీనివల్ల బీసీ,ఎస్సి, ఎస్టి మహిళలకు అన్యాయం జరుగుతుందన్నారు.రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందకూడదని 93% బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకు ఉపకోట 93 శాతం కల్పిస్తే ధర్మసమాజ్ పార్టీ ఈ మహిళా బిల్లుకు మద్దతు తెలుపుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా DSP పార్టీ నాయకులు & బాల్కొండ మండల నియోజకవర్గ ఇంచార్జ్ మహిపాల్ మహారాజ్,మండల ప్రచార కమిటీ సభ్యులు సతీష్,ఆత్మ గౌరవ్,క్రాంతి కిరణ్,మురళి,ఉమేష్(మోర్తాడ్) తరుణ్,మనోహర్, ముఖ్య నాయకులు,మహిళలు పాల్గొన్నారు.