*మహిళ పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్ ను వెంటనే ప్రారంభించాలి* ఎన్ ఎస్ యు ఐ

పెబ్బేరు జూలై  18 ( జనంసాక్షి ):
పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలోగల ప్రభుత్వ మహిళ పాలిటెక్నిక్ కళాశాలను సోమవారం కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్ యూఐ ఆధ్వర్యంలో సందర్శించి అక్కడ నెలకొన్న సమస్యలను కళాశాల ప్రిన్సిపాల్ రమేష్ తో చర్శించడం జరిగిందని ఎన్ఎస్ యూఐ మండల అధ్యక్షులు చంద్రశేఖర్ తెలిపారు. సందర్భంగా ఎన్ఎస్ యూఐ మండల అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ 2020 సంవత్సరంలో వసతి గృహం నిర్మాణం పూర్తయిన ఇప్పటివరకు ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటని విద్యార్థినీల హాస్టల్ నేటికి ప్రారంభము కాకపోవడంతో, నిరుపేద విద్యార్థునులు పెబ్బేరు పట్టణంలో ప్రవేటు హాస్టల్ లలో నెలకు వేలకు వేలు వెచ్చించి వసతి కల్పించుకోవడంతో ఆర్థిక భారంగా మారిందని,అందుకు గాను ఆ ప్రాంగణంలో ఉన్న వసతి గృహంలో కనీస సౌకర్యాలు అయిన వంట సామగ్రి,సిసి కెమెరాలు,సెక్యురిటి లేక వెలవెల బోతుందని కాబట్టి ఇప్పటికయినా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి హాస్టల్ ను అందుబాటులోకి తెచ్చి,పేద విద్యార్థులకు ఆర్థిక భారం నుండి విముక్తి చేయాలని లేదంటే సమస్య పరిష్కారానికి పోరాటం ఆపబోమని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎద్దుల విజయవర్దన్ రెడ్డి,జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు గంధం రంజిత్ కుమార్,యుత్ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ రణధీర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ నాయకులు గంధంB సునిల్,రాము,బాను,ఆల్వాల సాయి తేజగౌడ్,గంధం ఆంజీ,ఎన్ఎస్ యూఐ నాయకులు లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
Attachments area