మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహకు అభివృద్ధిపైమాట్లాడే హక్కు లేదు ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్
మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహకు అభివృద్ధిపైమాట్లాడే హక్కు లేదు ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ మంగళవారంఅభివృద్ధి నీ హాయంలో నా లేక మా హాయంలో జరిగిందా తేల్చుకుందామని..బహిరంగ చర్చకు సిద్ధం కావాలని ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు.ఎనిమిది సంవత్సరాలుగా అధికారం లేక నిరాశ నిస్స్పువలతో తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబంపై అవాకులు చవాకులు చేస్తున్నారని మండిపడ్డారు.ప్రతి గ్రామపంచాయతీకి ట్రాక్టర్లను ఇచ్చి ప్రగతిపథంలో పయనింప చేస్తుంది టిఆర్ఎస్ ప్రభుత్వమని,ఇప్పుడున్న కాంగ్రెస్ సర్పంచ్ గ్రామాల్లో అభివృద్ధిపై చర్చిద్దామని అన్నారు..
తెలంగాణలో ఉన్న సంక్షేమ పథకాలను బాదలామ్ చేయాలనే ఉద్దేశ్యంతో మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అన్నారు.తెలంగాణ ప్రజల అభీష్టం మేరకె ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.సంగారెడ్డి జిల్లా అందోల్ క్యాంపు కార్యాలయంలో స్థానిక టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నాయకులతో కలిసి ఎమ్మెల్యే క్రాంతికిరణ్ మీడియా సమావేశం నిర్వహించి మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహపై మండిపడ్డారు.దామోదర రాజనర్సింహ ముఖ్యమంత్రి కేసీఆర్ పై చేసిన ఆరోపణలను ఖండించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ప్రజలు సంక్షేమ పథకాలతో సంతోషంగా ఉన్నారని అన్నారు.ప్రజల మధ్య వ్యక్తిగతంగా ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో చిచ్చు రాజేసేందుకే ముఖ్యమంత్రిపై దామోదర రాజనర్సింహ అనవసర వ్యాఖ్యలు చేసారని అన్నారు. తెలంగాణ రాష్టం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రైతులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. దామోదర రాజనర్సింహ పదవీపోయీ రెండు తరాలు గడుస్తున్నా నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.కేసిఆర్ ఉద్యమం చేస్తేనే తెలంగాణ రాష్టన్నీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని గుర్తుచేశారు.నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ లుగా ఉన్న గ్రామాల్లో కూడా కెసిఆర్ ప్రభుత్వం అభివృద్ధి చేసిందని అన్నారు.