మాట నిలబెట్టుకోండి తెలంగాణ ప్రకటించండి

టీ ఎంపీల సమావేశంలో జానా
న్యూడిల్లీ, మార్చి 12 (జనంసాక్షి) ః
ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తామన్న వాగ్దానాన్ని నిలపెట్టుకోవాలని కాంగ్రెస్‌ అధిష్టానం ధృష్టికి తీసుకెళ్లనున్నామని టిఎంపిలు, టిమంత్రులు పేర్కొన్నారు. న్యూడిల్లీలో టిఎంపిల సమావేశం అనంతరం మంత్రిజానారెడ్డి ఎంపిలతోకలిసి విూడియా సమావేశంలో మాట్లాడుతూ మాటఇచ్చినప్రకారం రాష్ట్రం ఏర్పా టుచేస్తే అటుపార్టీబలోపేతం కావడమేకాక, ఇటు ప్రజల ఆకాంక్ష కూడా తీర్చినట్లవుతుందన్నారు. నెల రోజు ల్లోగా సమస్యను పరిష్కరించాలని టిఎంపిలు, మంత్రుల పక్షాన అధిష్టానాన్ని కోరారు. బహిరంగ విజ్ఞాపనే కాకుండా తమ ప్రతినిధులు స్వయంగా సోనియాగాంధీ, రాహుల్‌ గాందీలను కలిసి విజ్ఞప్తి చేస్తారన్నారు. కేంద్రంలో ఎంపిలు, రాష్ట్రంలో మంత్రులం తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకోసం ప్రయత్నాలు చేస్తామన్నా రు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుచేస్తే భారత దేశానికి తెలంగాణా వెన్నముకగా నిలిచేలా
తమ ప్రయత్నాలుం టాయన్నారు. తెలంగాణా ప్రాంతం కాంగ్రెస్‌కు పెట్టని కోటగా కూడా మారుతుందన్నారు. ఎంపిలు, మంత్రు లు, ఎమ్మెల్యేలంతా సమన్వయంతో పనిచేస్తూనే ఉన్నారని, ఇకముందు కూడా కొనసాగిస్తామన్నారు. హైక మాండ్‌ ఇప్పటికే ఈసమస్యను సీరియస్‌గా పరిగణిస్తున్నప్పటికి జరుగుతున్న ఆలస్యం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని జానారెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణా సాధిస్తాం….కాంగ్రెస్‌ను బలోపేతం చేస్తాం అని స్పష్టం చేశారు మంత్రి జానారెడ్డి. విూడియా అడిగే ప్రశ్నలకు సమాధానాలివ్వకుండా ఫ్లైట్‌ సమయం అయి పోతోందని, హైదరాబాద్‌ వెళ్లాల్సి ఉందన్నారు. చివర్లో ఎంపి ప్రభాకర్‌, మధుయాష్కిలు జైతెలంగాణా అంటూ నినాదాలిచ్చినా జానారెడ్డి మాత్రం నోరు మెదపకుండానే వెళ్లిపోయారు