మా చెవులు కొరుకుతున్నదెవరూ? ఫోన్‌ ట్యాంపింగ్‌లపై నిలదీసిన విపక్షాలు

ట్యాపింగ్‌ నిజం కాదన్న షిండే
న్యూఢిల్లీ, మార్చి 1 (జనంసాక్షి) :
ఫోన్‌ ట్యాంపరింగ్‌ వివాదంపై రాజ్యసభ శుక్రవారం అట్టుడికింది. బీజేపీ సీనియర్‌ అరుణ్‌ జైట్లీ ఫోన్‌ ట్యాంపరింగ్‌పై విపక్షం ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడింది. అయితే, ఫోన్‌ ట్యాపింగ్‌పై కేంద్ర ¬ం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే రాజ్యసభలో ఓప్రకటన చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ చేయడం లేదని స్పష్టం చేశారు. జైట్లీ ఫోన్‌ కాల్స్‌ వివరాలు కావాలని కొందరు అడిగారని, దానికి సంబంధించి ఢిల్లీ పోలీసులు కొన్ని అరెస్టులు చేశారని చెప్పారు. ‘ఎవరి ఫోన్‌ ట్యాపింగ్‌ చేయడం లేదు. ఢిల్లీ పోలీసులు కొన్ని అరెస్టులు చేశారు. అయితే, అది ట్యాపింగ్‌ కేసులో కాదు. అరుణ్‌ జైట్లీ కాల్‌ డేటా కావాలని కొందరు వ్యక్తులు కోరారు. అందుకే అరెస్టులు. అయితే, కాల్‌ డేటా రికార్డులు బహిరంగ పరచలేదు’ అని చెప్పారు. దీనికి సంబంధించి ఇప్పటివరకు నలుగురిని అరెస్టు చేసినట్లు సభకు తెలిపారు. అయితే, ఆయన ప్రకటనను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ ప్రకటనలో ఎలాంటి సమాచారం లేదని మండిపడింది.ప్రభుత్వం కొంత మంది రహస్య ఏజెంట్లను నియమించి ప్రతిపక్ష నేతల కదలికలు, ఫోన్‌ కాల్స్‌పై నిఘా పెట్టిందని బీజేపీ మండిపడింది. ప్రభుత్వమే తొలుత తన మంత్రులపై రహస్యశోధన సాగించిందని, ఇప్పుడేమో ప్‌రతిపక్షా లపై దృష్టి సారించిందని ఆరోపించింది. ఇది తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని బీజేపీ నేత ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ప్రధానమంత్రి జోక్యం చేసుకోవాలని, పార్లమెంట్‌లో ఓ ప్రకటన చేయాలనడి ఆయన డిమాండ్‌ చేశారు.
ఇదిలా ఉంటే, తన ఫోన్‌ కూడా ట్యాపింగ్‌ చేస్తున్నారని జేడీయూ ఎంపీ వివానంద్‌ తివారీ ఆరోపించారు. అలాగే తన సహచరుడు ఎన్‌కేసింగ్‌, సమాజ్‌వాదీ పార్టీ నేత రామ్‌గోపాల్‌ యాదవ్‌ కూడా ఫోన్లు ట్యాపింగ్‌ అవుతన్నాయని చెప్పారన్నారు. దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఫోన్లు ట్యాపింగ్‌ చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్‌ అవుతున్నాయి? ఎవరు ట్యాపింగ్‌ చేయిస్తున్నారు? ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.