మితిమీరుతున్న సీమాంధ్రుల కండకావరం
తెలంగాణ లారీల రాకతో ఆంధ్ర రోడ్లు చెడిపోతున్నయట !
తాడేపల్లిగూడెంలో మన లారీలను అడ్డుకున్న స్థానిక ఎమ్మెల్యే నాని
డ్రైవర్లను బెదిరించిన ఎమ్మెల్యే అనుచరులు
వత్తాసు పలికిన స్థానిక ఆర్డీఓ.. చలాన్లు రాసి డ్రైవర్లకు వేధింపులు
మండిపడుతున్న తెలంగాణవాదులు
నానిపై కేసు నమోదు చేయాలని డిమాండ్
తెలంగాణలో సీమాంధ్ర లారీలను తిరుగనివ్వమని హెచ్చరికలు
హైదరాబాద్, ఆగస్టు 5 (జనంసాక్షి) : సీమాంధ్రుల దుశ్చర్యలు రోజురోజుకూ మితిమీరి పోతున్నాయి. శాంతియుతంగా ప్రత్యేక రాష్ట్ర సాధ న కోసం పోరాడుతూ, తెలంగాణ సెటిలర్లను ఆప్యాయతతో ఆదరిస్తున్న తెలంగాణ ప్రజల సహనం నశించేలా సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ప్రవర్తిస్తున్నారు. అడుగడుగునా ప్రత్యేక రాష్ట్రానికి అడ్డుపడుతూ తెలంగాణ ప్రజలను గాయ పర్చడ మే కాకుండా, ఆ గాయాలపై కారం చల్లినట్లు వ్యవహరిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నా రు. ఈసారి సీమాంధ్రులు తమ అక్కసును తెలం గాణ లారీలపై వెల్లగక్కారు. తెలంగాణ నుంచి విశాఖ పోర్టుకు తరలుతున్న తెలంగాణ లారీలను తాడేపల్లిగూడెం వద్ద స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల నాని అడ్డుకున్నారు. తెలంగాణ లారీలు ఆంధ్రలో తిరగడం వల్ల అక్కడి రోడ్లు చెడిపోతున్నాయని ఓ కుంటి సాకు చెప్పి తన విషాన్నివెల్లగక్కారు. లారీలను ఆపి డ్రైవర్లను అసభ్య పదజాలంతో దూషిస్తూ మా ఏరియా దాటి వెళ్లాలంటే డబుల్ ఫైన్లు కట్టాలని బెదిరించారు. దీనికి స్థానిక ఆర్డీఓ వత్తాసు పలుకుతూ లారీ డ్రైవర్లను ఇబ్బందులకు గురి చేశారు. ఎమ్మెల్యే నాని నాయకత్వంలో ఆ ప్రభుత్వాధికారి తెలంగాణ డ్రైవర్లతో బలవంతంగా చలాన్లు కట్టించారు. అక్కడి నుంచి కొందరు లారీ డ్రైవర్లు తెలంగాణ నాయకులతో మాట్లాడుతూ నాని ఎంత చలాను రాయమంటే ఆర్డీఓ అం త చలాన్లు రాశారని ఆరోపించారు. అధికారుల కన్నా నాని అనుచరులు పెద్ద ఎత్తున లారీలను ఆపి, తమను నానా దుర్భాషలాడారని డ్రైవర్లు తెలిపారు. ఆంధ్రలో తెలంగాణ లారీ డ్రైవర్లను ఎమ్మెల్యే నాని ఇబ్బంది పెడుతున్న దావానలంలా తెలంగాణ అంతటా వ్యాపించడంతో తెలంగాణ వాదులు ఈ దుశ్చర్యపై మండిపడుతున్నారు. తెలంగాణ డ్రైవర్లను వేధించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే నానిపై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. లేకుంటే, సీమాంధ్ర లారీలను తెలంగాణలోని పది జిల్లాల్లో తిరుగనివ్వమని హెచ్చరించారు.