మిషన్‌ భగీరథకు నిరంతరాయ విద్యుత్‌

ఖమ్మం,జూన్‌4(జ‌నం సాక్షి): మిషన్‌ భగీరథ కోసం ప్రత్యేకంగా సబ్‌ స్టేషన్లను ని,ట్రాన్స్‌ఫార్మర్లు, ఫీడర్లను ఏర్పాటు చేస్తున్నారు. త్వరలో మిషన్‌ భగీరథ ప్రారంబం కానుండడంతో విద్యుత్‌ సమస్యలేకుండ ఆచర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగావృద్ధికి సంకల్పించడంతో తమవంతు బాధ్యతగా మెరుగైన విద్యుత్‌ను ప్రజలకు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నాలుగేళ్ల కాలంలో విద్యుత్‌ శాఖలో ఊహించని మార్పులను చూస్తున్నామని విద్యుత్‌శాఖ అధికారులు అన్నారు.ప్రభుత్వ సహకారం, విద్యుత్‌శాఖ ఉద్యోగుల పనితనంతో 24 గంటల ఉచిత విద్యుత్‌ను వ్యవసాయ రంగానికి అందిస్తున్నారు. అవసరమైన చోట నూతన సబ్‌ స్టేషన్లను నిర్మిస్తున్నారు. 33కేవీ లైన్లను పెంచారు. చిన్నచిన్న ట్రాన్స్‌ఫార్మర్లను మార్చి కొత్తవిఏర్పాటు చేశారు. ఎక్కడా కూడా లో ఓల్టేజీ సమస్య తలెత్తకుండా జిల్లా వ్యాప్తంగా కొత్త ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేసి ఆ సమస్యను తీర్చారు. మిషన్‌భగీరథ కోసం ఐదు సబ్‌స్టేషన్‌లు నిర్మించగా అశ్వాపురంలోని రథంగుట్ట వద్ద, కుమ్మరిగూడెం, పాల్వంచలోని తోగ్గూడెం, టేకులపల్లిలోని 9వ మైల్‌ తండా, ఇల్లెందులోని కోరగుట్టలలో వీటిని ఏర్పాటు చేశాం.