మిషన్‌ వరల్డ్‌కప్‌ 2015

– రిజర్వ్‌బెంచ్‌పై దృష్టిపెట్టిన ధోనీ
ముంబై ,జనవరి 29 :ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌ గెల వడం ద్వారా భారత జట్టుకు గొప్ప ఊరట లభించింది. గత ఏడాది పాకిస్థాన్‌ చేతిలో ఓటమి తర్వాత ఇదే తొలి విజయం కావడంతో మన క్రికెటర్లు కాస్త రిలాక్సయ్యారు. అయితే ఈ సిరీస్‌ ద్వారా కొన్ని లోపాలు కూడా బయటపడ్డా యి. దీంతో వీటిని సరిదిద్దుకోవడంతో పాటు వ చ్చే ప్రపంచకప్‌కు ఇప్పటి నుండే టీమ్‌ను సిధ్ధం చేసుకోవాలని ధోనీ భావిస్తున్నాడు. దీని కోసం ప్రణాళికలు కూడా సిధ్దం చేసుకుంటున్నాడు. వన్డే ప్రపంచకప్‌ సాధించిన తర్వాత మన ప్రద ర్శన ఆ స్థాయిలో లేదన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరుస వైఫల్యాలతో జట్టు ఇబ్బం దిపడింది. వరల్డ్‌కప్‌ విజయంతో ప్రారంభంలో వాటిని ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇప్పడు మా త్రం సీరియస్‌గా తీసుకోకుంటే ఇబ్బందే. ఎందు కంటే వచ్చే ప్రపంచకప్‌కు ఇంకా రెండేళ్ళే మిగి లి ఉంది. తమ ఛాంపియన్‌ ¬దా నిలుపు కోవాలంటే ఈ ప్రదర్శన ఏమాత్రం సరిపోదని ఖచ్చితంగా చెప్పొచ్చు. దీంతో జట్టు కూర్పుపై కెప్టెన్‌ ధోనీ దృష్టి పెట్టాడు. ఇప్పటి నుండే ప్రపంచకప్‌కు మంచి జట్టును సిధ్ధం చేసుకోవా లని భావిస్తున్నాడు. ఈ ఏడాది చివరికల్లా యు వఆటగాళ్ళతో కూడిన రిజర్వ్‌ బెంచ్‌ను త యా రు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ రిజర్వ్‌ బెంచ్‌లోని ఆటగాళ్ళనే వచ్చే ప్రపంచకప్‌లో ఆడే విధంగా ప్లాన్‌ చేస్తున్నాడు. అన్ని విభాగాల్లోనూ నిలకడగా రాణించే ఆటగాళ్ళను ఎంపిక చేయ డం కష్టమే. ప్రస్తుతం జట్టులో ఉన్న చాలా మంది ప్లేయర్స్‌ నిలకడలేమితో ఇబ్బం దిపడు తున్నారు. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో ఇది పూర్తిగా బయటపడింది. అయితే బ్యాటింగ్‌ ఆర్డర్‌ లో మార్పులు చేయడం ద్వారా దీనిని సరిచే సేందుకు ధోనీ ప్రయత్నించాడు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రయోగాలు కొనసాగుతాయని ధోనీ స్పష్టం చేశాడు. జట్టులో సీనియర్‌ ఆటగాళ్ళు లేకపోవడంతో ఇకపై యువక్రికెటర్లే బాధ్యత తీసుకోవాలి. అటు బౌలింగ్‌లో షవిూ అహ్మాద్‌ , భువనేశ్వర్‌ కుమార్‌లే కీలకం కాను న్నారు.ఇంగ్లాండ్‌పై రవీంద్ర జడేజా రాణిం చినప్పటకీ… మరొక ఆల్‌రౌండర్‌ అవసరముంది. ధోనీ వ్యూహం ప్రకారం ఇర్ఫాన్‌ పఠాన్‌ మళ్ళీ జాతీయ జట్టులోకి వచ్చి ఆ లోటు భర్తీ చేయాలని కోరుకుంటున్నాడు. జడేజా స్పిన్‌ విభాగంలోనూ , పఠాన్‌ ఫాస్ట్‌ బౌలింగ్‌లోనూ ఆల్‌రౌండర్‌గా కీలకపాత్ర పోషించాలని ఆశిస్తున్నాడు. దీని కోసం సెలక్టర్లతో చర్చించి , పూర్తి స్థాయిలో తన ప్లాన్స్‌ అమలు చేయాలని ధోనీ భావిస్తున్నాడు. మొత్తం విూద ఏడాది చివరికల్లా భారత వన్డే టీమ్‌ రిజర్వ్‌ బెంచ్‌ మిషన్‌ వరల్డ్‌కప్‌ 2015కు సిధ్ధం కానుంది.