మిషన్ భగీరథ త్రాగునీరు పూర్తి స్థాయిలో ప్రతి ఇంటికి అందించాలి: వికారాబాద్ ఎమ్మెల్య డాక్టర్ మెతుకు ఆనంద్”
మిషన్ భగీరథ త్రాగునీరు పూర్తిస్థాయిలో ప్రతి ఇంటికి అందించాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్* పేర్కొన్నారు శుక్రవారం మీతో నేను కార్యక్రమంలో భాగంగా మోమిన్ పేట్* మండల పరిధిలోని పల్లెగుట్ట తండా, కిషన్ నాయక్ తండా* మరియు ఇజ్రా చిట్టెంపల్లి* గ్రామాల్లో పర్యటించారు పల్లె గుట్ట తండాలో థర్డ్ వైర్ ఏర్పాటు చేయాలని, వంగిన స్థంబాలు తీసివేసి, వాటి స్థానంలో నూతన స్థంబాలు ఏర్పాటు చేయాలన్నారు పల్లెగుట్ట తండాలో రోడ్ల మురుగు నీరు పారకుండా సైడ్ డ్రైన్ నుండి వెళ్లేలా చూడాలని, పంచాయతీ కార్యదర్శినీ ఆదేశించారు.కిషన్ నాయక్ తండాలో నూతనంగా నిర్మించిన ఇండ్లకు ఆ కాలనీలో మంజూరు చేయబడిన మిషన్ భగీరథ నీటి ట్యాంక్ ను నిర్మించి, ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చి, త్వరగా మిషన్ భగీరథ నీరు అందించాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలో ప్రతి బుధవారం పశువుల డాక్టర్ గ్రామ పంచాయతీ దగ్గర అందుబాటులో ఉండాలని పశు వైద్య శాఖ అధికారులను ఆదేశించారుఇజ్రా చిట్టెంపల్లి గ్రామ పంచాయతీలో అవసరమైన చోట నూతన స్థంబాలు ఏర్పాటు చేసి, పాత విద్యుత్ తీగలు మళ్ళీ మళ్ళీ తెగిపోతూ ప్రమాదాలు జరుగుతున్నాయని, నూతన విద్యుత్ తీగలు ఏర్పాటు చేయాలన్నారు.గ్రామంలోని మిషన్ భగీరథ నీటి ట్యాంకును నెలలో 1,11,21వ తేదీలలో కచ్చితంగా శుభ్రం చేయాలన్నారు.గ్రామంలో పాడు బడ్డ ఇండ్లు మరియు పిచ్చిమొక్కలు తొలగించాలని, మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు, ప్రజలు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.ఇజ్రా చిట్టెంపల్లి గ్రామంలో 4వ వార్డులో నీటి కొరతను అధిగమించాలని, గ్రామ ప్రజలకు నీరు సరిపడేలా అందించాలని, ప్రజలు నల్లాలకు చెర్రలు తీయకుండా ఉండాలని సూచించారు, పరిశుభ్రమైన మంచినీటిని ప్రతి ఇంటికి అందించాలని, ప్రజలు మిషన్ భగీరథ నీటిని త్రాగేలా మిషన్ భగీరథ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.ఈమూడు గ్రామాల్లో అవసరమైన చోట రోడ్లు మరియు మురుగు కాలువల నిర్మాణానికి కృషి చేద్దామన్నారు.గ్రామంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మించుకొని వాటిని వాడుకలో ఉంచాలన్నారుగ్రామ ప్రజలు మెచ్చుకునేలా పని చేస్తున్న సర్పంచ్ ని ఎమ్మెల్యే అభినందించారు.*
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాశీరాం నాయక్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ గౌడ్ సర్పంచుల సంఘం అధ్యక్షుడు హరి శంకర్ పిఎసిఎస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి ఎంపీటీసీ కౌశల్ కుమార్ గోవర్ధన్ రెడ్డి కృష్ణారెడ్డి సర్పంచులు రాజశేఖర్ అంజయ్య యాదవ్ సత్యనారాయణ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ డి లక్ష్మయ్య పార్టీ అధ్యక్షులు డి వెంకట్ నాయకులు బిలియా నాయక్ సర్దార్ నాయక్ రవి నాయక్ ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.