మిషన్ భగీరథ సొమ్ము అడవి పాలేనా…?

గుంజేడు అటవీ ప్రాంతంలో ఇనుప కంచెలు

హెయిర్ వాల్ కు సిసి పిల్లర్లు మర్చిపోయారా…!

కొత్తగూడ జూలై 24 జనంసాక్షి:ఏజెన్సీ మండలంలో మిషన్ భగీరథ పైప్లైన్ గాలికి వదిలేశారు.రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ప్రజలకు సురక్షితమైన నీరు అందించాలని లక్ష్యంతో మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే…కానీ క్షేత్రస్థాయిలో అమలు చేయకపోవడానికి ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి గల కారణాలు తెలియని పరిస్థితి…మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని గోపాలపురం,తాటివారు వేంపల్లి మార్గ మధ్యలో ఎర్ వాల్ నేలకు ఓరిగిపోయి రోజులు గడుస్తున్న అధికారులు,సిబ్బంది గాలికి వదిలేసారు.ఆ ఎర్ వాల్ కు ఇనుప కంచె,సిసి పిల్లర్ నిర్మించాల్సి ఉండగా కేవలం ఉందంటే ఉందనే మాదిరిగానే ఏర్పాటు చేయడం గమనార్హం.వర్షపు నీరు సైతం ఆ గుంతలోనే ఆగి నీరు బుడగలుగా వస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.ఎయిర్ వాల్ కు బిగించాల్సిన కంచెలు జిల్లా కేంద్రానికి ప్రధాన రహదారి గుంజేడు అటవీ ప్రాంతంలో పదుల సంఖ్యలో దర్శనమిస్తున్నాయి.ఏళ్లు గడుస్తున్న అక్కడి నుండి ఇనుప కంచె కదలడం లేదు.ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తున్నారనేది తెలియని పరిస్థితి.గ్రామస్తులు మాట్లాడుతూ సిసి పోయకుండా ఇలా ఉండడం వల్ల పైప్ లైన్ కదిలి నీరు బుడగలుగా వస్తున్నాయని అంటున్నారు.ఇలా కలుషిత నీరు తాగడం వల్ల మా ఆరోగ్యం పాడైతే ఎవరు బాధ్యత వహిస్తారని వారు ఆవేదన వ్యక్తపరిచారు.ఎయిర్ వాల్ కు గుంత కూడుపలే,జాల బిగించలే,సిసి పిల్లర్ నిర్మించకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.