మి దేశానికి తిరిగి వెళ్ళండి
శ్రీలంక ఫుట్‌బాల్ జట్లకు తమిళనాడు సిఎం ఆదేశం
చెన్నై ,సెప్టెంబర్ 3:తమ రాష్ట్రంలో పర్యటిస్తోన్న శ్రీలంక ఫుట్‌బాల్ జట్లు వెంటనే స్వదేశానికి తిరిగి వెళ్ళిపోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆదేశించారు. తమిళయన్లకు , లంకేయలకు మధ్య గతంలో తలెత్తిన నిభేదాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రాయల్ కాలేజ్ ఆఫ్ కొలంబో భారత్‌లో పర్యటిస్తోంది. ఇటీవలే ఆ జట్టు చెన్నై కస్టమ్స్ టీమ్‌తో ఫ్రెండ్లీ మ్యాచ్ కూడా ఆడింది. దీంతో మ్యాచ్ ఆడేందుకు అనుమతించి స్టేడియం అధికారుల్లో ఒకరిని జయలలిత సస్పెండ్ కూడా చేశారు. వారిని స్టేడియంలో ఆడించడం ద్వారా తమిళియన్లను అవపరిచాడని వ్యాఖ్యానించారు. నిజానికి భారత్‌లో కొద్ది రోజులు ట్రైనింగ్ అయ్యేందుకు లంక ఫుట్‌బాల్ టీమ్స్ ఇక్కడకి వచ్చాయి. దీనిపై కూడా జయలలిత తీవ్రంగా మండిపడ్డారు. భారతీయుల పట్ల గతంలో ప్రవర్తించిన తీరు మరిచిపోయి వారికి అనుమతి ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇటీవల కొంతమంది లంక ఎయిర్‌ఫోర్స్ అధికారులు కూడా భారత్‌లో శిక్షణ పొందడం వివాదాస్పదమైంది. అప్పుడు కూడా తమిళనాడు ప్రభుత్వం కలుగజేసుకుని వారిని స్వదేశానికి పంపించివేసింది.