ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆర్డిఓ స్వర్ణలత

 

పినపాక నియోజకవర్గం జూలై 19 (జనం సాక్షి): మణుగూరు మండలంలోని ముంపు ప్రభావిత గ్రామాలైన అన్నారం, కమలాపురం, రాయిగూడెం లో మంగళవారం ఆర్డిఓ స్వర్ణలత పర్యవేక్షణలో.తహసిల్దార్ నాగరాజు సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముంపు వల్ల నష్టపోయిన బాధితుల వివరాలను అడిగి నోట్ చేసుకున్నారు. ప్రభుత్వం అందజేసే నష్టపరిహారాన్ని నేరుగా వారి కుటుంబాలకు చేరే విధంగా ప్రభుత్వ యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇటీవల భద్రాచలం పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి కె సి ఆర్ ఆదేశాలను అధికార యంత్రాంగం పటిష్టంగా అమలు చేస్తోంది. అన్నారంలో సర్వే బృందంతో కలిసి జడ్పిటిసి పోషం నరసింహారావు పర్యటించారు.వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ముంపు ప్రభావిత ప్రజల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని తెలిపారు. బాధితుల మనోధైర్యాన్ని పెంచే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన కొనసాగిందని అన్నారు బాధితులకి నష్టపరిహారాన్ని నేరుగా అందే విధంగా చేయాలని ఆయన కోరినారు. ఈ కార్యక్రమంలో మణుగూరు తహసిల్దార్ నాగరాజు, ప్రాధమిక పరపతి సంఘం అధ్యక్షులు కురి నాగేశ్వరరావు టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు నాయకులు ఉద్దండు మెడ నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు