సహాయక చర్యలను ముమ్మరం చేయాలి….
అధికారులకు మంత్రి ఆదేశం

బ్యూరో,, జూలై 15:జనంసాక్షి,,, భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాల్లో శుక్రవారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించారు. సోన్ మండలం జాప్రాపూర్పెం, మాదాపూర్ గ్రామాల్లో వర్షాలకు దెబ్బతిన్న పంటలను, రహదారులను పరిశీలించారు. వరద బాధితులను పరామర్శించారు. తక్షణమే సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను… మంత్రి ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు. పంట పొలాలను, రోడ్లను పరిశీలించి వ్యవసాయ, ఆర్ అండ్ బీ అధికారులతో మాట్లాడారు. నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా చూస్తామని తెలిపారు
గ్రామీణ ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన పారిశుధ్యం, మురుగునీటి పారుదల, మెడికల్ క్యాంపుల నిర్వహణ వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.అనంతరం లక్ష్మణచాంద మండలంలోని పీచర, వడ్డెపల్లి, మునిపల్లి, చింతల్ చాంద తదితర గ్రామాల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించారు