ముంపు బాధితులకు నిత్యవసర వస్తువులు అందజేసిన అధికారులు.

-డబల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాలి.
కన్నాయిగూడెం, జూలై 21(జనంసాక్షి):-
గత కొద్ది రోజులుగా విస్తృతంగా కురుస్తున్న వర్షాలకు గోదావరి నది ఉగ్రరూపం దాల్చి కన్నాయిగూడెం మండలము ను అతలాకుతలం చేసింది. ఈ మేరకు ముఖ్య మంత్రి కెసిఆర్ వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి బాధితులను ఆదుకునేందుకు తక్షణ సహాయం కింద ఒక్కొక్క కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఈ మేరకు కన్నాయిగూడెం మండల కేంద్రము చింతగుడెం గ్రామంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన మాట ప్రకారం చింతగుడేం, ముప్పనపల్లీ, గుర్రేవుల,లక్ష్మీపురం,దేవాదుల,గంగుడేం గ్రామలలో ముంపు ప్రాంతాల బాధిత కుటుంబాలకు జిల్లా పంచాయతీ అధికారి కొండా వెంకయ్య సమక్షంలో బాధితులకు 25కేజీ ల బియ్యం,5కేజీ ల పప్పు అందజేశారు.ఈ సందర్భగా ఎంపీపీ జనగాం సమ్మక్క, వైస్ ఎంపీపీ బోల్లే భాస్కర్, మాట్లాడుతూ భారీ వర్షాల మూలాన ప్రజలకు తీవ్రంగా అస్తి నష్టం,పంట నష్టం వాటిల్లింది అని వెను వెంటనే బాధితులకు ఆర్థిక సాయం 10వేలతో పాటు డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టించి ఇవ్వాలనీ సమ్మక్క అధికారులని కొరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి కొండా వెంకయ్య, కన్నాయిగూడెం తహశీల్దార్ వీరాస్వామి, ఎంపిడిఓ ఫణిచంద్ర,ఎంపిఒ సాజిద భేగం,
జాడి రాంబాబు,పొడేం బాబు,అలం రాంబాబు, యాకూబ్ పాషా, పోడెం నరసింగరావు,మంగళూరు సత్యం,గడ్డం నాగేష్,తొంగాల రాంబాబు,బొట నాగేష్, దాసరి నరసింహరావు సర్పంచులు,ఉప సర్పంచ్ లు, ప్రజా ప్రతినిధిలు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.