*ముగ్గురు వ్యక్తుల బైండోవర్*
*పలిమెల, అక్టోబర్ 11 (జనంసాక్షి)* పలిమెల మండలంలోని పంకెన గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులను తాహసిల్దార్ కి బైండోవర్ చేసారు. ఎస్సై అరుణ్ తెలిపిన వివరాల ప్రకారం ప్రజా శాంతికి భంగం కలిగించే విధంగా ముగ్గురి ప్రవర్తన ఉండటంతో సత్ప్రవర్తన కోసం తహసిల్దార్ కి బైండోవర్ చేసినట్లు తెలిపారు. లక్ష రూపాయల సొంత పూచికత్తుపై బైండోవర్ చేసినట్లు తెలిపారు. బైండోవర్ చేసిన వారిలో పంకెన గ్రామానికి చెందిన ఎర్ని సుధాకర్, ఎర్ని సోమయ్య, చిలుముల రాంబాబులు ఉన్నారు. సంవత్సరం అనంతరం వీరి సత్ప్రవర్తన తీరును బట్టి తదుపరి చర్యలు ఉంటాయని ఎస్సై అరుణ్ తెలిపారు.