ముగ్గురు సభ్యుల దోపిడి దొంగల ముఠా అరెస్ట్

– వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి వెల్లడి
వరంగల్ ఈస్ట్, జూలై 19(జనం సాక్షి):
 జల్సాలకు అలవాటు పడి దోపిడికి పాల్పడిన ముగ్గురు సభ్యుల ముఠాను మంగళవారం మట్టెవాడ పోలీసులు అరెస్ట్ చేసారు.వీరి నుండి పోలీసులు ఒక బోలెరో కారుతో పాటు ఒక ద్విచక్రవాహనం, ఒక
సెల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసినవారిలో హనుమకొండ ప్రాంతానికి చెందిన అట్లూరి ప్రణీత్ కుమార్ చౌదరి, తండ్రి పేరు ప్రమోద్ కుమార్ చౌదరి, వయస్సు 21, జక్కనబోయిన నితీష్ ప్రీతం, తండ్రి పేరు కుమార స్వామి, వయస్సు 21, యం.డి అశ్వక్ నవీద్, తండ్రి పేరు ఆయూబ్ పాషా, వయస్సు 21.
ఈ ముఠా అరెస్టు సంబంధింది మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి వివరాలను వెల్లడిస్తూ పోలీసు అరెస్ట్ చేసిన నిందితుల్లో ప్రణీత్ డీగ్రీ మూడువ సంవత్సరం చదువుచుండగా, మిగితా ఇద్దరు నిందితులు చదువుచున్నారు. వీరు ముగ్గురు ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో వీరి మద్య స్నేహం కుదిరింది. దీనితో వీరు ముగ్గురు కల్సి జల్సాలు చేయడం, మద్యం సేవించడం చేయడం ప్రారంభించారు. వీరి జల్సాలకు వీరి వద్ద వుండే డబ్బు సరిపోకపోవడంతో పాటు సులభంగా డబ్బును సంపాదించాలనుకున్నారు. ఇందుకోసం నిందితులు ముగ్గురు దొపిడి చేసి డబ్బు సంపాదించాలకున్నారు. ఇందులో భాగంగా నిందితులు ఈ నెల 11వ తేది ఆర్థరాత్రి సమయంలో ములుగు రోడ్డు మీదుగా వెళ్ళుతున్న బోలేరో వాహనాన్ని నిందితుడు ద్విచక్ర వాహనం పై అనుసరించి ఆటోనగర్ ప్రాంతంలో రోడ్డు పై బోలెరో వాహనంను అడ్డగించి వాహన యజమానిని
బెదిరించి అతి నుండి సెల్ ఫోన్ తో పాటు సదరు బోలెరో వాహనాన్ని దొపిడి చేసి పారిపోయినారు. ఈ సంఘటనపై భాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న మట్వాడా పోలీసులు పోలీస్ కమిషనర్ ఉత్తర్వులకు మేరకు దర్యాప్తు చేపట్టిన మట్వాడా పోలీసులకు లభించిన ఆధారాలతో నిందితులను గుర్తించిన పోలీసులు వారి కదలికలపై నిఘా ఏర్పాటు చేసారు. నిందితులు తాము దొపిడి చేసిన కారు ఆటోనగర్ లో అమ్మి సొమ్ము చేసుకుందామని ఈరోజు ఉదయం నిందితులు ముగ్గురు చోరి చేసిన కారులో హనుమాన్ జంక్షన్ మార్గం నుండి ఆటోనగర్ పై వస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం రావడంతో మట్వాడా ఇన్ స్పెక్టర్ రమేష్ అధ్వర్యంలో హనుమన్ జంక్షన్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు అనుమానంతో నిందితుల వాహనం తనీఖీ చేయగా వారి వద్ద కారుకు సంబంధించి ఎలాంటి దృవీకరణ పత్రాలు లేకపోవడం నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా నిందితులు పాల్పడిన దొపిడిని అంగీకరించారు.
నిందితులను పట్టుకోవడం ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ డిసిపి అశోక్ కుమార్, వరంగల్ ఏసిపి గిరికుమార్, మట్టాడా ఇన్ స్పెక్టర్ రమేష్, ఎస్.ఐ పవన్ కుమార్, ప్రసన్న,ఏ.ఏ.ఓ సల్మాన్ పాషా, ఏ.ఏస్.ఐ చంద్ర మౌళి,  కానిస్టేబుళ్ళు తిరుపతి,హరికాంత్,ఐటీ కోర్ కానిస్టేబుల్  నగేశ్ హోంగార్డ్ కృష్ణలను వరంగల్ పోలీస్ కమిషనర్ అభినందించి రివార్డు అందజేసారు.
Attachments area