ముదిరాజులను బీసీ డి నుంచి బీసీ ఏ లోకి మార్చాలి
ముదిరాజ్ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేశ్ ముదిరాజ్
నర్సాపూర్. సెప్టెంబర్ , 27, ( జనం సాక్షి ) :
ముదిరాజ్ కులస్తులను బి సి డి లో నుంచి బీసీ ఏ లోకి మార్చాలని అలాగే రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు ముదిరాజ్ కులస్తులకు రాజకీయంగా ప్రాధాన్యత కల్పించాలని ముదిరాజ్ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్ అన్నారు.
మంగళవారం నాడు నర్సాపూర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో నియోజకవర్గ ముదిరాజ్ సంఘం సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముదిరాజ్ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి కాసాని ముదిరాజ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ లో జరిగే ముదిరాజ్ సింహ గర్జన కార్యక్రమానికి నర్సాపూర్ లో సన్నాహక సమావేశం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. దసరా తర్వాత నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో కమిటీ లు వేయనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగి ఉన్న ముదిరాజ్ కులస్తులు అన్ని రంగాల్లో రాణించాలని ఆయన పేర్కొన్నారు.
విద్య ,ఉపాధి, ఉద్యోగ అవకాశాలలో ముదిరాజ్ కులస్తులకు ప్రాధాన్యం కల్పించాలని కోరుతూ హైదరాబాద్ నగరంలోని జింఖానా గ్రౌండ్లో సింహ గర్జన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామం నుంచి సింహా గర్జన కు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు.
ముదిరాజ్ కులస్తులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పుట్టి రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సదానంద, రాష్ట్ర నాయకులు వెంకటేశం, చెన్నయ్య, మాజీ జెడ్పిటిసి మాధవి జగదీష్ , మాజీ ఎంపీపీ వెంకట రమణ రావు, హాట్నోర జడ్పిటిసి ఆంజనేయులు, కొల్చారం జెడ్ పి టి సి మేఘమాల సంతోష్, సర్పంచ్ లు వెంకటేష్, రవి, నర్సాపూర్ నియోజకవర్గం ఇంచార్జి దిగంబర్ ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు ముదిరాజ్ సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్ ఎన్ ఎస్ పి 1 సమావేశంలో మాట్లాడుతున్న ముదిరాజ్ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్
ఫోటో రైట్ అప్ ఎన్ ఎస్ పి 2 సమావేశానికి పెద్ద సంఖ్యలో హాజరైన ముదిరాజ్ సంఘం నాయకులు కార్యకర్తలు