ముద్దు మురిపాల కంటే ముర్రు పాలు ముద్దు
ఆస్తుల కన్నా అమ్మ పాలు మిన్న
దంతాలపల్లి ఆగస్టు 6 జనంసాక్షి
బిడ్డ పుట్టిందనే సంతోషంలో చూపించే వద్దు మురిపాల కంటే మొదటి గంటలో పట్టే ముద్దని డోర్నకల్ శాసనసభ్యులు డిఎస్ రెడ్యానాయక్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన డి ఎస్ రెడ్యానాయక్ ముందుగా తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బిడ్డ పుట్టిన మొదటి గంటలోనే వచ్చే ముర్రుపాలను తప్పనిసరిగా పట్టించాలని ఆ విధంగా పట్టిస్తే పోషకాహారం సమృద్ధిగా అంది బిడ్డ ఎదుగుదలకు ఎంతగానో దోహదపడుతుందని సూచించారు అదేవిధంగా పిల్లలకు పాలు పడితే తల్లి శరీర సౌష్టవం దెబ్బతింటుందనే అపోహవద్దని హితవు పలికారు. బిడ్డ కనీసం ఆరు నెలల వయసు వచ్చేవరకు తల్లిపాలు మాత్రమే పట్టాలని,ఆ విధంగా చేసినట్లయితే బిడ్డకు బిడ్డకు ఎడం కూడా పెరుగుతుందని అన్నారు. అనంతరం ఐసిడిఎస్ మరిపెడ సిడిపిఓ శిరీష మాట్లాడుతూ… తల్లిదండ్రులు పిల్లలకు ఇచ్చే ఆస్తిపాస్తులు కన్నా అమ్మ పాలు మిన్న అన్నారు.ప్రకృతి ప్రసాదించిన అత్యుత్తమ పౌష్టికాహారం తల్లి పాలేనని అన్నారు పుట్టిన బిడ్డకు గంటలోపు ముర్రు పాలు పట్టించడం తప్పనిసరి అని సిడిపిఓ ఎల్లమ్మ తెలియజేశారు.తల్లి పాల విశిష్టతను తెలిపేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాది ఆగస్టు నెల మొదటి వారం రోజులు తల్లిపాల వారోత్సవాలుగా నిర్వహిస్తున్నారు. తల్లి పాలు ఇవ్వకుంటే భవిష్యత్తులో పలు రకాల ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.నవజాత శిశువులకు తల్లి పాలు అమృత తుల్యమైనవన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ ఓలాద్రి ఉమా మల్లారెడ్డి మండల వైద్యాధికారి డాక్టర్ వేద కిరణ్, స్థానిక తహసిల్దార్ కిషోర్ కుమార్ ,ఎంపీడీవో బండి గోవిందరావు,సూపర్వైజర్ సుధా వివిధ గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు, అంగన్వాడి టీచర్లు, ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.