మునుగోడు ఉప పోరులో బీసీలను విస్మరించిన మూడు ప్రధాన పార్టీలు :
జాజుల లింగంగౌడ్
మిర్యాలగూడ అక్టోబర్ 7. జనం సాక్షి : మునుగోడులో జరిగే ఉప ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు కూడా 60 శాతం ఉన్న బీసీలను విస్మరించాయని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. టీఆర్ఎస్,కాంగ్రెస్, బిజెపి ఈ మూడు పార్టీలు 60 శాతం జనాభా ఉన్న వారిని కాదని కేవలం 3 శాతం ఉన్న అగ్రకులాల వారికి కేటాయించడమంటే బీసీలను వంచించడమే.ఈ అగ్రకుల రాజకీయ పార్టీలన్ని బీసీలను జండాలు మోయడానికి,జిందాబాద్ లు కొట్టడానికి,ఓట్లు వేసే యంత్రాలుగానే వాడుకుంటున్నాయని ఆరోపించారు.అన్ని పార్టీలో సామాజిక న్యాయం లోపించిందన్నారు.ఇప్పటికైనా బీసీలు కళ్ళు తెరవాలని,అన్ని పార్టీలు కూడా బీసీలను వాడుకుంటాయే తప్ప రాజ్యాధికారంలో మాత్రం భాగం కల్పించరన్నారు. మనల్ని బీరు,బిర్యానీ వరకే పరిమితం చేస్తారు.పార్టీలకు అతీతంగా మునుగోడులో బీసీ అభ్యర్థిని నిలబెడతామని అన్నారు.ఈ కార్యక్రమంలో బంటు వెంకటేశ్వర్లు,అంజి యాదవ్,ఫరూక్,జంగిలి రవి,జానయ్య తదితరులు పాల్గొన్నారు.