మున్నూరు కాపులు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలి
టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన కోల నాగేశ్వరరావుకు ఆత్మీయ సన్మానం
హుజూర్ నగర్ డిసెంబర్ 4 (జనంసాక్షి): మున్నూరు కాపులు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కోల నాగేశ్వరరావు కోరారు. ఆదివారం మండలంలోని లింగగిరి గ్రామంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో వన భోజన మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాపులంతా సంఘటితంగా ఉండి రాజ్యాధికారం సాధించాలన్నారు. ప్రభుత్వంలో కాపులు కీలక భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. రాజకీయంగా సంఘటితంగా ఉంటేనే హక్కులు సాధించవచ్చునని అన్నారు. సమాజంలోని ఇతర వర్గాలకు కాపులు మార్గదర్శకంగా, స్ఫూర్తిగా నిలవాలని పిలుపునిచ్చారు. అనంతరం టియుడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా కోల నాగేశ్వరరావును కాపు సంఘ నేతలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ మండల మున్నూరు కాపు నేతలు కామిశెట్టి వెంకటేశ్వర్లు, కాసర్ల నాగేశ్వరరావు, తోట వీరస్వామి పంతులు నాగేశ్వరరావు, చలమల రాఘవయ్య, కడియం రమేషు, కిరణ్ కుమార్, సత్యనారాయణ, మంచి కంటి పుల్లారావు, వీరబాబు, సైదులు తదితరులు పాల్గొన్నారు.