మున్సిపల్ చైర్ పర్సన్ ను కలిసి వినతిపత్రం అందజేసిన కూరగాయల వ్యాపారులు
రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, ( జనంసాక్షి) నూతనంగా నిర్మించిన వెజ్ నాన్ వెజ్ మార్కెట్ భవనం లో కూరగాయలు అమ్ముటకు షాపులను కేటాయించాలని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ కప్పరి స్రవంతి చందుని కలిసి వినతి పత్రం అందజేసిన కూరగాయల వ్యాపారులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 35 సంవత్సరాల నుండి ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో మరియు సాకలి ఐలమ్మ చౌరస్తాలో, సంతోష్ థియేటర్ దగ్గర ఇలా పలు స్థలాలలో కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నామని, ఇలా రోడ్లపై కూరగాయలు అమ్ముకుంటూ నిత్యం రోడ్డు ప్రమాదాలు మరియు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ జీవనం సాగిస్తున్నాం. వెజ్ నాన్ వెజ్ బిల్డింగ్ పూర్తి చేసి, పురపాలక మంత్రివర్యులు కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించి నెలలు గడుస్తున్న అర్హులైన మాకు కేటాయించడం లేదని చైర్మన్ కి విన్నవించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ మీకు ఉపాధి కల్పిస్తూనే మున్సిపాలిటీ ఆదాయం సమకూరుతుంది.వీలైనంత తొందరలో సాధారణ సమావేశం ఏర్పాటు చేసి, పురపాలక సభ్యులతో మాట్లాడి,అర్హులైన అందరికీ వెజ్ నాన్ వెజ్ భవనం లో షాపులను కేటాయించడం జరుగుతుందని తెలియజేశారు.