మున్సిపల్ నిర్మాణ తవ్వకాల్లో పురాతన అమ్మ వారి విగ్రహం లభ్యం
మిర్యాలగూడ. జనం సాక్షి. స్థానిక హోసింగ్ బోర్డు లో పార్క్ నిర్మాణం కొరకు మున్సిపాలిటీ అధికారులు త్రవ్వకాలు జరుపుతుండగా పురాతనమైన అమ్మవారి విగ్రహం బయల్పడిన ఘటన , పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ వెంకటేశ్వరస్వామి దేవాలయం పక్కన గల ప్రభుత్వ స్థలంలో పార్కు నిర్మాణం చెయ్యాలని పురపాలక సంఘం వారు భావించి ఈరోజు నిర్మాణ పనులు ప్రారంభించారు,నిర్మాణ పనులలో భాగంగా పునాదులు తీస్తున్న క్రమంలో కనకదుర్గమ్మ అమ్మవారి విగ్రహం భూమిలో నుండి బయటపడింది,,,, అమ్మవారి విగ్రహం బయల్పడిన విషయం తెలుసుకున్న ప్రజలు పెద్దసంఖ్యలో ఆ ప్రాంతానికి చేరుకుని అమ్మవారి విగ్రహం బయల్పడిన ప్రదేశంలో దేవాలయాన్ని నిర్మించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు, దేవాలయ నిర్మాణం కొరకు తమవంతు విరాళాలు కూడా అందచేస్తామని వారు చెబుతున్నారు,