ముప్కాల్ లో జాతీయ జెండా ఆవిష్కరణ

ముప్కాల్ జనం సాక్షి ఆగస్టు 14 మండల కేంద్రంలో జాతీయ జెండాను ఆదివారం ఘనంగా ఆవిష్కరించారు.65 ఫీట్ల ఈ జాతీయ జెండాను రిటైర్డ్ డీపివో గద్దల సంజీవ్ ఆవిష్కరించారు. ఇందులో ముస్కు ముత్తెన్న, విలాస్, గోపినాత్ ల ఆర్థిక సహాయంతో ఆవిష్కరణ చేశారు. మిగతా జెండా కు అయ్యే ఖర్చు అంతా గ్రామ పంచాయతీ ముప్కాల్ వారు భరించడం జరిగింది. ఏది ఏమైనా తమ గ్రామంలో ఎప్పుడు లేని విదంగా 65 ఫీట్ల జాతీయ జెండా ఎగరడం చాలా ఆనందంగా ఉందని గ్రామస్థులు అంటున్నారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ కొమ్ముల శ్రీనివాస్, ఎంపిపి సామ పద్మ వెంకట్ రెడ్డి, జెడ్పిటిసి బద్దం నర్సవ్వ నర్సారెడ్డి, ఎంపిటిసి పద్మ, కో అప్షన్ మెంబర్ మునీరొద్దీన్, విడిసి చైర్మన్ ముస్కు నర్సయ్య, ఉప సర్పంచ్ సువర్ణ లింగం, వార్డు మెంబర్స్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.