ముమ్మరంగా కొనసాగుతున్న పోడు భూముల సర్వే

టేకులపల్లి, అక్టోబర్ 22( జనం సాక్షి ): టేకులపల్లి మండలంలోని గోలియా తండా, టేకులపల్లి, తడికలపూడి, కొప్పురాయి, బేతంపూడి గ్రామ పంచాయతీ లో పోడు భూముల సర్వే ముమ్మురంగా కొనసాగుతోంది. శనివారం గోలియా తండ గ్రామపంచాయతీలో పోడు భూముల సర్వే చేస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి వి. ప్రశాంత్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పి దేవ్ సింగ్ నాయక్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ ఆర్ సి కమిటీ చైర్మన్ జి రామ్ చందర్, కమిటీ కార్యదర్శి నాక, పంచాయతీ 7వ వార్డు సభ్యులు అనంతుల.వెంకన్న, సిబ్బంది నెహ్రూ,పొడు రైతులు తదితరులు పాల్గొన్నారు. గొల్య తండ పంచాయతీ పరిధిలో మొత్తం దరఖాస్తులు 152 వచ్చాయని, అందులో ఇప్పటి వరకు 90 మంది రైతుల భూములను సర్వే చేయడం జరిగిందని పంచాయతీ కార్యదర్శి వి. ప్రశాంత్ తెలిపారు.