ముమ్మరంగా వైద్య శిబిరాలు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన

టేకులపల్లి,ఆగస్టు 30( జనం సాక్షి ): సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ కందుల దినేష్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది నిత్యం గ్రామాలలో, పాఠశాలలో, హాస్టల్లో ముమ్మరంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ, శుభ్రత,పరిశుభ్రత,సీజనల్ వ్యాధుల పట్ల, దోమల నివారణ, మురికి కాలువలలో లార్వాల పెరుగుదలపై అప్రమత్తం చేస్తూ ప్రజలకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తూ చైతన్యవంతం చేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం మండలంలోని బట్టు తండా, రావులపాడు, చుక్కాలిబోడు, బొమ్మనపల్లి, మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే బాలుర హాస్టల్లో వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు అవసరమైన చికిత్సలను అందజేశారు. మొత్తం 132 మందిని పరీక్షించి తగు మందులు పంపిణీ చేశారు. 11 మందికి త్వరితగతిన ఫలితం తేలే జ్వర పరీక్షలు ఆర్డిటి నిర్వహించారు. బట్టు తండాలో దోమల నివారణకు పైరిత్రిమ్ స్పేస్ స్ప్రే చేయించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత ఆవశ్యకత పై అవగాహన కల్పించారు. ప్రతి శుక్రవారం, మంగళవారం డ్రై డే కార్యక్రమాలు నిర్వహించుకోవాలని, దోమలు పెరగడానికి అవకాశం ఉన్న నీటి నిల్వలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటిని నిర్మూలించాలని, దోమలు పుట్టకుండా, కుట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దోమకాటు ద్వారా వచ్చే డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, మెదడువాపు,బోదకాలు తదితర వ్యాధులు దరి చేరవని సూచించారు. ఈ సీజన్లో కాచి చల్లార్చిన నీళ్లు త్రాగడం మంచిదని సాధ్యమైనంత వరకు వేడి ఆహార పదార్థాలను మాత్రమే భుజించాలని తద్వారా టైఫాయిడ్ వాంతులు, విరోచనాలు, కామెర్లు లాంటి అంటు వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చని ఈ సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ వైద్య శిబిరాల్లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్