ముషారఫ్‌కు జ్యూడిషియల్‌ కస్టడీ

ఇల్లే సబ్‌ జైల్‌
ఇస్లామాబాద్‌, (జనంసాక్షి) :
పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌కు ఉగ్రవాద నిరోధక కోర్టు శనివారం మే 4 వరకు కస్టడీ విధించింది. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 60 మంది న్యాయ మూర్తులను ఏకపక్షంగా తొలగిం చడమే కాకుండా.. అక్రమ నిర్బంధానికి పాల్పడిన కేసులో ముషారఫ్‌ను శుక్రవారం అరెస్టు చేసిన పోలీసులు శనివారం ఉదయం ఉగ్రవాద నిరోధక న్యాయ స్థానంలో ప్రవేశపెట్టారు. ఇరుపక్షాల వాదనాలు విన్న అనంతరం న్యాయమూర్తి కౌసర్‌ అబ్బాస్‌ జైదీ తీర్పును రిజర్వ్‌లో ఉంచారు. ముషారఫ్‌కు మే 4 వరకు రిమాండ్‌ విధిస్తూ.. ఆ రోజు హాజరు పరిచా లని పోలీసులను ఆదేశించారు. అంతకు ముందు మాజీ అధ్యక్షుడి తరఫున కమర్‌ అఫ్జల్‌ వాదనలు వినిపిస్తూ.. కేసు దర్యాప్తుకు ముషారఫ్‌ సహక రించారని తెలిపారు. భద్రతా కారణాల రీత్యా ఆయనను పోలీసు కస్టడీకి అప్పగిం చవద్దని కోరారు.
  ఇస్లామాబాద్‌ హైకోర్టు బెయిల్‌ ఇవ్వడాన్ని నిరాకరిస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది అష్రాఫ్‌ గుజ్జార్‌ వాదిస్తూ.. తాజా దర్యాప్తు కోసం ముషారఫ్‌ను పోలీసు కస్టడీకి అప్పగించాలని కోరారు.