ముస్కు శేఖర్ రెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించిన : ఎల్బీనగర్ తెరాస పార్టీ ఇంచార్జి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్
ఎల్బీనగర్ (జనం సాక్షి ) నాగోల్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు ముస్కు శేఖర్ రెడ్డి గత గురువారం అకస్మాత్తుగా గుండె నొప్పి రావడంతో సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ లో చికిత్సపొందుతూ పరమపదించారు. ఈ విషయం తెలుసుకొన్న ఎల్బీనగర్ తెరాస పార్టీ ఇంచార్జి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ఉదయం సాయి నగర్ కాలనీలోని వారి నివాసానికి వెళ్లి శేఖర్ రెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంభ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు .
