ముస్లిం మైనారిటీలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించాలి

కడప, జూలై 21 : రాష్ట్రంలోని ముస్లిం మైనారిటీలకు పది శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని అవాజ్‌ కమిటీ జిల్లా అధ్యక్షుడు మస్తాన్‌వలి డిమాండ్‌ చేశారు. ముస్లింలు అనేక ప్రాంతాల్లో ప్రత్యేక్ష రాజకీయాల్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ రాజకీయ పార్టీలు ఆ దిశగా చర్యలు తీసుకోవడంలేదని విమర్శించారు. చిన్న చిన్న పదవులతో మైనారిటీలను పార్టీలు మభ్యపెడుతూ వస్తున్నాయని, ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల సమయంలో మైనారిటీలకు పావులుగా ఉపయోగించుకుంటున్న అన్నిరాజకీయ పార్టీలు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పారు.