మూడు నియోజకవర్గాల్లో టిఆర్‌ఎస్ జోరు
నేరుగా రంగంలోకి దిగిన అభ్యర్థులు
ఇంటింటి ప్రచారంతో ¬రెత్తుతున్న ప్రచారం
జనగామ,నవంబర్28(జనంసాక్షి): టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఎక్కడికి వెళ్లినా స్థానిక ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పూలమాలలు, మంగళ హారతులు, డప్పు చప్పుళ్లు, కోలాటాలతో ఘన స్వాగతం పలుకుతున్నారు. కారు గుర్తుకే ఓటేసి అభ్యర్థులను గెలిపించడమే కాకుండా మరోసారి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటిస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభల సక్సెస్ జోష్‌తో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రచారం ¬రెత్తిస్తున్నారు. ఎన్నికలు సవిూపిస్తున్న క్రమంలో వేలాదిగా ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. జనగామ నియోజకవర్గంలోని జనగామ, బచ్చన్నపేట, తరిగొప్పుల మండలాల్లో ముత్తిడ్డి యాదగిరిడ్డి ప్రచారం నిర్వహించారు. పాలకుర్తి అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాలకుర్తి, దేవరుప్పుల మండలాల్లో జోరుగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా పెద్దసంఖ్యలో జనం ఆయనకు మద్దతు ప్రకటించారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలోని రఘునాథపల్లి, జఫర్‌గడ్, స్టేషన్‌ఘన్‌పూర్ మండలాల్లో పార్టీ శ్రేణులు రాజయ్య గెలుపు కోరుతూ జోరుగా ప్రచారం చేశారు. ఇంటింటికీ తిరుగుతూ టీఆర్‌ఎస్ సంక్షేమ పథకాలు వివరిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు. విస్తృతంగా పర్యటిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ సభలను విజయవంతంగా నిర్వహించడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ముఖ్యంగా జిల్లాకు సాగు, తాగునీటికి శాశ్వత పరిష్కారం, మల్లన్నసాగర్, మల్కాపూర్ లింగంపల్లి రిజర్వాయర్‌ను పూర్తి చేసుకుని చెరువులు నింపుకుని రెండు పంటలు పండేలా చర్యలు తీసుకుంటామని చెప్పడం పట్ల రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. పింఛన్లు, రైతు బంధు ఆర్థిక సాయాన్ని పెంచడంతోపాటు నిరుద్యోగ యువతకు జీవన భృతి కల్పిస్తామని సీఎం ప్రకటించడం ఆయా వర్గాల్లో భరోసా నింపింది. జనగామకు మెడికల్, నర్సింగ్ కళాశాలతోపాటు పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేస్తామనడం, స్టేషన్ ఘన్‌పూర్‌లో 100 పడకల దవాఖాన, మెగా టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామనడం యువతలో జోష్ నింపింది. పాలకుర్తి ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామనడం ఆ ప్రాంతవాసులకు ఆనందాన్నిచ్చింది. జనగామ, పాలకుర్తి, స్టేషన్ ఘన్‌పూర్ అభ్యర్థులు ముత్తిడ్డి యాదగిరిడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, తాటికొండ రాజయ్యకు ప్రచారంలో ప్రజల నుంచి అనూహ్యమైన మద్దతు లభిస్తోంది.
ఇంటింటి ప్రచారంలో ఎర్రబెల్లి సతీమణి
కేసీఆర్‌కు మరోసారి అధికారం కట్టబెట్టడానికే ప్రజలు నిర్ణయించారని సంక్షేమ పథకాలే దీనికి ప్రధాన కారణమని మాజీ ఎమ్మెల్యే దయాకర్‌రావు సతీమణి ఉషాదయాకర్‌రావు అన్నారు. మరో దశాబ్దం అధికారం ఇస్తే తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా నిలుస్తుందనేది ప్రజాభిప్రాయమన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ నేరుగా ప్రజలకు చేరడంతో ఆయా కుటుంబాలు పూర్తి సంతృప్తిగా ఉన్నాయని అన్నారు.పలు ప్రాంతాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావు గెలుపును కాంక్షిస్తూ ఆమె ప్రచారం నిర్వహించగా ప్రజలు పెద్ద ఎత్తున నీరాజనాలు పలికారు. ఊరూవాడా కదిలిరాగా, మహిళలు కోలాటాలు, గొల్లకుర్మలు డోలు వాయిద్యాలు, డప్పులతో ఈ ప్రచారంలో పాల్గొని టీఆర్‌ఎస్ పార్టీకి మద్దతు పలికారు. కేసీఆర్, ఎర్రబెల్లి నాయకత్వాన్ని బలపరుస్తూ నినాదాలు చేశారు. గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఉషాదయాకర్‌రావు కూడళ్లలో జనంతో మాట్లాడారు. దశాబ్దాలపాటు కాంగ్రెస్‌కు, టీడీపీకి అధికారం కట్టబెట్టినా తెలంగాణ ప్రాంతానికి ఒరిగిందేవిూ లేదని, నూతన రాష్ట్రం తెలంగాణలో కేసీఆర్
నాలుగున్నరేళ్ల పాలన స్వర్ణయుగంలా నడిచిందన్నారు.