మూడేళ్లలో రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులు

ప్రపంచంలో టాప్‌`5లో రిలయన్స్‌ : ముఖేశ్‌
ముంబై, జూన్‌ 6 (జనంసాక్షి) :
మూడేళ్లలో రూ. 1.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పెట్రో కెమికల్‌ ఉత్పత్తుల్లో ప్రపంచంలోనే టాప్‌`5 స్థానంలో చోటు సంపాదించాలన్నదే లక్ష్యమని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వెల్లడిరచింది. వచ్చే మూడేళ్లలో రూ.1.5 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు సంస్థ చైర్మన్‌ ముఖేశ్‌ అంబానీ ప్రకటించారు. 2015 నాటికి మధ్యప్రదేశ్‌ సోహగ్‌పూర్‌లోని సీబీఎం బ్లాక్‌లో ఉత్పత్తి ప్రారంభిస్తామని వెల్లడిరచారు. కేజీ`డీ6లో ఇటీవల బయటపడ్డ నిక్షేపాలతో మరింత పుష్కలంగా గ్యాస్‌ ఉత్పత్తి చేస్తామని తెలిపారు. గురువారం ముంబైలో జరిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 39వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ముఖేశ్‌ అంబానీ ప్రసంగించారు. 2015 నాటికి మధ్యప్రదేశ్‌ సోహగ్‌పూర్‌లోని సీబీఎం బ్లాక్‌లో ఉత్పత్తి ప్రారంభించాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు తెలిపారు. రిలయెన్స్‌ చరిత్రలోనే అత్యధిక పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు. ఆయిల్‌, గ్యాస్‌ వెలికితీత, ఉత్పత్తి, రిఫైనింగ్‌, మార్కెటింగ్‌, పెట్రో కెమికల్స్‌, రిటైల్‌, బ్రాడ్‌బ్యాండ్‌, డిజిటల్‌ సర్వీసెస్‌లలో మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు. పెట్రో కెమికల్స్‌ ఉత్పత్తులను 15 మిలియన్‌ టన్నుల నుంచి 25 మిలియన్‌ టన్నులకు విస్తరించుకొని ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద సంస్థగా ఆవిర్భవించనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది టెలికాం రంగంలో మరినని సేవలతో దూసుకుపోనున్నట్లు ముఖేశ్‌ తెలిపారు. త్వరలోనే 4జీ సర్వీసులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. 4జీ సర్వీసుల కోసం వచ్చే మూడేళ్లలో భారీగా పెట్టుబడులు పెడతామన్నారు. చిల్లరవర్తకంలో కొనుగోళ్లు, అమ్మకాల్లో సమతుల్యం సాధించామని తెలిపారు.