మృతుల కుటుంబాలను పరామర్శించిన సిరికొండ…….
టేకుమట్ల.జులై (జనంసాక్షి) జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని వివిధ గ్రామాలలో గురువారం తెలంగాణ తొలి శాసన సభాపతి,ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి పర్యటించారు.ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన మృతుల చిత్రపటాలకు పూలమాల వేసి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి మనో ధైర్యాన్ని అందించారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు కత్తి సంపత్,సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు గుణిగంటి మహేందర్,మండల నాయకులు నేరెళ్ల రామకృష్ణ, తోట సాగర్,సంతోష్,ఖమ్రుద్దీన్,తోట గట్టయ్య,అభి రాజు,తదితరులు పాల్గొన్నారు.