మెదక్‌ జిల్లాలో కొనసాగుతున్న బంద్‌

మెదక్‌ : బయ్యారం గనుల కేటాయింపుపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తెరాస ఇచ్చిన పిలుపు మేరకు మెదక్‌ జిల్లాలో బంద్‌ కొనసాగుతోంది. ఈ తెల్లవారుజామున సంగారెడ్డిలో రెండు బస్సులను దుండగులు దహనం చేశారు. మెదక్‌, సిద్ధిపేట, గజ్వేల్‌, నారాయణ్‌ఖేడ్‌ బస్సు డిపోల ముందు తెరాస నేతలు ఆందోళన చేపట్టి బస్సులను అడ్డుకున్నారు. మెదక్‌ అర్టీసీ డిపో ఎదుట ధర్నా చేస్తున్న మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి సహా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. సంగారెడ్డిలో పలుచోట్ల గుమిగూడిన ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జహీరాబాద్‌లో పది మంది తెరాస నేతలను అరెస్టు చేశారు.