మెస్‌ల ప్రైవేటీకరణపై కొనసాగుతున్న ఆందోళన
వరంగల్ : కాకతీయ యూనివర్షిటీలో మెస్‌ల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. విద్యార్థుల ఆందోళన రెండు రోజుకు చేరుకుంది. ఈ ఉదయం విద్యార్థులు అల్పాహారం బంద్ చేసి నిరసన వ్యక్తం చేశారు. పరిశోదక విద్యార్థులు యూనివర్షిటీని బంద్ చేయించారు. విద్యార్థుల ఆందోళనకు సంఘాలు వద్దతు ప్రకటించాయి.