మేడారం జాతరకు ప్రతి శాఖ కట్టుదిట్టమైన భద్రత పనులు ఏర్పాటు…

.

 

 

 

జనం సాక్షి (మేడారం)ఫిబ్రవరి16(జనం సాక్షి):-ఆహార భద్రత శాఖ

జాతరలో ఆహార నాణ్యతను పరీక్షించేందుకు మొబైల్ టెస్టింగ్ మెషీన్ ను ఏర్పాటు చేసి ఎక్ససైజ్ అధికారులతో బృందలగా ఏర్పాటు చేసి రెండు షిఫ్టులలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

మత్స్యశాఖ

జంపన్న వాగు ప్రాంతంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 17.38 లక్షల నిధులతో ముందస్తుగా 250 మంది గజ ఈతగాళ్లను,తెప్పలను సెర్చ్ లైట్లను అందుబాటులో ఉంచారు.

సమాచార శాఖ

జాతరను ప్రపంచ వ్యాప్తంగా కళ్ళకి కట్టినట్టు చూపించడానికి మీడియా పగలు రాత్రి శ్రమిస్తోంది. సమాచార పొరసంబంధాల శాఖ ద్వారా మీడియా కి అవసరనైన ఏర్పాట్లు చేసింది. మీడియా సెంటర్ ఏర్పాటు చేసి పాత్రికేయులకు కంప్యూటర్లు, నెట్ సదుపాయాలు కలిపించారు. అదే విధంగా గత జాతర ఫొటోలతో ఛాయాచిత్ర ప్రదర్శన అలాగే కళాకారులకు చేయూత అందించడంలో భాగంగా పరిసర ప్రాంతాలలో గ్రామీణ కళారూపాలు ప్రదర్శన ఏర్పాట్లు చేశారు.

బిఎస్ఎన్ఎల్ ఉచిత వైఫై సేవలు

మేడారంలో బిఎస్ఎన్ఎల్ ఉచిత వైఫై సేవలు అందిస్తుంది.20 వై ఫై హాట్ స్పాట్స్ ను జాతర పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసి 2G, 3G,4G సేవలను భక్తులకు అందజేస్తున్నారు.
[16/02, 1:22 pm] G.Prashanth Sir: పర్యాటక శాఖ ప్రదర్శన శాలను ప్రారంభించిన కలెక్టర్ కృష్ణ ఆదిత్య…

ములుగు(మేడారం), ఫిబ్రవరి16(జనం సాక్షి):-

పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శన శాలను జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య బుధవారం ప్రారంభించారు.మేడారంలోని శ్రీ సమ్మక్క-సారాలమ్మ ఆదివాసీ మ్యూజియం ఆవరణలో జిల్లాలోని వివిధ పర్యాటక ప్రాంతాలపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాల్ ను జిల్లా కలెక్టర్ సందర్శించి పర్యాటక స్థలాలపై ఏర్పాటు చేసిన ఫోటోలను తిలకించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ప్రాంతం పర్యాటకులను మంత్ర ముగ్దులను చేసే దృశ్యాలు అనేకం ఉన్నాయన్నారు. టూరిజం శాఖ 3రోజుల ట్రిప్ ను ఏర్పాటు చేస్తే పర్యాటకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.వరంగల్ జిల్లాలోని పర్యాటక స్థలాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రముఖ చారిత్రాత్మకమైన దేవాలయం గా ములుగు జిల్లా లోని రామప్ప గుర్తింపు పొందినందున పర్యాటకులకు చక్కని విజ్ఞానం తో కూడిన వినోదం అందించ గలుగుతామని అదే విధంగా ఆసియాలోనే రెండవ అతి పెద్ద గిరిజన సంస్కృతి సంప్రదాయాలతో మేళవించిన దైవసన్నిధి శ్రీ సమ్మక్క-సారాలమ్మ మహాజాతర ను దర్షింప చేసేందుకు ప్రణాళిక రూపొందించి అభివృద్ధికి బాటలు వేయాలన్నారు.
అనంతరం జిల్లాలోని పర్యాటక ప్రదేశాలతో రూపొందించిన బ్రోచర్ ను కలెక్టర్ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ,వంశీ మోహన్ తదితరులు పాల్గొన్నారు.