మేడిగడ్డకు జలకళ..

 

కాళేశ్వరం ,జులై 15(జనంసాక్షి):కాళేశ్వరం ఇప్పుడు ఒక జలభాండాగారంగా మారింది. అనునిత్యం గోదావరి జలాలతో పునీతమవుతూ జలదేవాలయాన్ని తలపిస్తోంది. కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల.. ఇలా ఎక్కడ చూసినా అద్భుత జలదృశ్యం కనిపిస్తోంది. కిలోవిూటర్ల మేర గోదావరి నీళ్లు పరుగులు తీస్తుంటే చూడడానికి రెండు కళ్లూ చాలడం లేదు.గోదారమ్మ పరుగులతో కాళేశ్వరం ఇప్పుడు ఉప్పొంగిపోతోంది. పైనుంచి గోదారమ్మ వాయువేగంతో దూసుకొస్తుంటే ఆ కమనీయ దృశ్యం అందరినీ ఆకట్టుకుంటోంది. అలా పై నుంచి వస్తున్న కాళేశ్వర గంగను చూస్తుంటే కడుపు నిండిపోతోంది. ముఖ్యంగా ఆయకట్టు రైతులు, అన్ని వర్గాల జనం నీటిని చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో పారుతున్నది గోదావరి జలాలు కాదు.. అన్నదాతల ఆకాంక్షలు నెరవేర్చే అమృతధారని ఉప్పొంగిపోతున్నారు. పచ్చటి పంటలకు భరోసాగా గలగలపారుతున్న గోదారమ్మకు.. ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వాగతం పలికారు. తెలంగాణ గడ్డ జలఆర్తిని తీర్చేలా కాళేశ్వరాన్ని సాకారం చేసి.. గోదారమ్మను తమ పోలాలకు తీసుకువస్తున్న అపర భగీరథుడు సీఎం కేసీఆర్‌ కు అన్నదాతలంతా ధన్యవాదాలు చెబుతున్నారు.కాళేశ్వరం ఆయకట్టు ప్రాంతమంతా ఇప్పుడు పండుగ వాతావరణం నెలకొంది. గల గల పారుతున్న గోదారమ్మను చూడడానికి అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో కాళేశ్వరం ఇప్పుడు పర్యాటక క్షేత్రంలా మారింది. జనం పెద్ద ఎత్తున ఈ జలసంద్రాన్ని చూసేందుకు తరలివస్తున్నారు.మొత్తం గా కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు తెలంగాణ జలదేవాలయంగా ఆలరారుతోంది. జలతరంగిణీ రాగాలతో ఎగసిపారుతున్న గోదావరి జలాలను.. రైతులు, ప్రజలు ఆరాధిస్తున్నారు. పూజలు, ¬మాలతో .. ఆ పరివాహక ప్రాంతమంతా ప్రత్యేక ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతున్నది.