మైనింగ్ ఉద్యోగిపై కలెక్టర్ కు ఫిర్యాదు.

మైనింగ్ ఉద్యోగిపై కలెక్టర్ కు ఫిర్యాదు.
కాల్వ శ్రీరాంపూర్.. కాల్వ శ్రీరాంపూర్ మండలం మొట్లపల్లి గ్రామానికి చెందిన ట్రాక్టర్ యజమానులు మైనింగ్ ఉద్యోగి దాసరి నవీన్ పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.. మైనింగ్ శాఖలో ఎస్ ఆర్ వో గా పనిచేస్తున్న దాసరి నవీన్ కుమార్ రాత్రిపూట విధులు నిర్వహిస్తూ ముడుపులు ఇచ్చిన వారికి ఇసుక ట్రాక్టర్లను వదిలేస్తున్నాడు అని మో ట్లపల్లి గ్రామానికి చెందిన బెజ్జాల వెంకటేష్ ,పోగుల ప్రవీణ్, బొమ్మ శ్రీనివాసు కలెక్టర్ కి ఇచ్చిన ఫిర్యాదుల పేర్కొన్నారు. నవీన్ ద్వారా సంబంధిత పై అధికారులకు కూడా ముడుపులు అందుతున్నాయని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. మా వద్ద కూడా నెల నెల మామూలు తీసుకొని మమ్ములను ప్రోత్సహించాడు అన్నారు. నగదు రూపేనా గూగుల్ పే ఫోన్ పే రూపేనా డబ్బులు కూడా ఇచ్చినట్లు కలెక్టర్ కు సంబంధిత ఫోన్ ద్వారా పంపిన ఆధారాలను జిల్లా కలెక్టర్ కు ఇచ్చిన ఫిర్యాదులు వారు పేర్కొనడం జరిగింది. డబ్బులు ఇస్తేనే ఇసుక కొట్టుకోవాలని లేకుంటే ఇసుక ట్రాక్టర్ పట్టుకుంటానని ఫోన్ పే ద్వారా వెయ్యాలని ఒత్తిడి కూడా చేశాడు అన్నారు. సంబంధిత రికార్డుతో సహా మా వద్ద ఆధారాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు .ఈ విషయంపై జిల్లా కలెక్టర్ స్పందించి ఎస్ఆర్వో పై చర్యలు తీసుకోవాలని లేనిచో రాష్ట్రంలోని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.