మొక్కలు నాటాలి పర్యావరణాన్ని రక్షించాలి
పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్క నాటిన డి.ఎస్.పి సదయ్య
కొత్తగూడ అక్టోబర్ 7జనం సాక్షి:మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ను శుక్రవారం రోజున ఆకస్మితంగా తనిఖీ చేసిన మహబూబాద్ డిఎస్పి సదయ్య అనంతరం స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించి కేసులపై ఆరా తీశారు.పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్క నాటారు.డిఎస్పి సదయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలని పర్యావరణాన్ని కాపాడాలని కోరారు.ఈ కార్యక్రమంలో గూడూరు యాసిన్,స్థానిక ఎస్ఐ నగేష్,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.