మొహరం సందర్భంగా పీరీల సందడి
స్టేషన్ ఘనపూర్, ఆగస్టు 08, ( జనం సాక్షి ): మండలంలోని తాటికొండ లో మోహరం పండుగ సందర్భంగా పీరీలను ఊరేగిస్తూ ఉత్సవాలు ఘ నంగా జరుపుకున్నారు. గ్రామంలో ప్రతిఇంటింటికి తిరుగుతూ పీరీలను డప్పుసప్పుల్ల మధ్యనృత్యా లు చేస్తూ ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడామొహ రం సందర్భంగా గ్రామంలో పీరీలను ఊరేగిస్తూ ఉత్సవాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో
గుగులోత్ రాజు,గుగులోత్ సమ్మన్న, బానోత్ అని ల్,బానోత్ రాజు,భుక్య భద్రు,వాంకుడోత్ భీకోజీ, భుక్య హేము,భుక్య గణేష్ ,గుగులోత్ భాస్కర్, వాంకుడోత్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.