‘మోడీ’ భాజపా అంతర్గత వ్యవహారం

నోరు విప్పిన రాహుల్‌
ఢల్లీి, జూన్‌ 15 (జనంసాక్షి) :
భారతీయ జనతాపార్టీలో జరు గుతున్న పరిణామాలపై కాంగ్రె స్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహు ల్‌గాంధీ తొలిసారిగా స్పంది ంచారు. గుజరాత్‌ ముఖ్య మంత్రి నరేంద్రమోడికి ఎన్ని కల ప్రచార కమిటీ ఉపాధ్యక్ష పదవికి కట్టబెట్టడం ఆ పార్టీ సొంత వ్యవహారమని, దాంతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాలలో కాంగ్రెస్‌ పార్టీ ఎలా ఉంది, దాని బలోపేతానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాల్సిందన్నది మాత్రమే తమకు అవసరమని రాహుల్‌ చెప్పారు. బీజేపీ తెగతెంపులు చేసుకుంటామని ప్రకటించిన జేడీయూను కాంగ్రెస్‌ ఆహ్వానిస్తుందా అని విలేకరులు ప్రశ్నించగా పార్టీ సీనియర్‌ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. రాబోవు ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాము చేసిన అభివృద్ధే తమ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.