మోదీ ఆపిల్ సీఈవో కీలక చర్చలు
న్యూఢిల్లీ,మే 21(జనంసాక్షి):ఆపిల్ సీఈవో టిమ్ కుక్ శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ‘నరేంద్రమోదీ’ మొబైల్ యాప్ ను కుక్ విడుదల చేశారు. టిమ్ కుక్ ను కలిసినందుకు చాలా ఆనందంగా ఉందని, భారత్ లో పర్యటించడం పట్ల మోదీ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.అందుకు సమాధానం ఇచ్చిన కుక్ త్వరలో మరోసారి ఇండియాకు రావడానికి ఇప్పటినుంచి ప్రణాళికలు తయారుచేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కొత్తగా విడుదల చేసిన అప్ డేటెడ్ యాప్ లో వాలంటరీంగ్ సంబంధించిన సరికొత్త వివరాలున్నాయని వెల్లడించారు. కుక్ చేతుల విూదుగా యాప్ రిలీజ్ కావడం తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని మోదీ పేర్కొన్నారు.