యదాద్రిజిల్లా తుర్కపల్లి మండలం (జనం సాక్షి) ప్రతినిధి

 డి ఎం హెచ్ ఓ నిర్లక్ష్యం  పుట్టగొడుగుల్లా వెలుస్తున్న
నర్సింగ్ హోమ్ లు..
ఫోటో రైట్ అప్  01తుర్కపల్లి విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ
సీజ్ చేసిన హాస్పిటల్ కి పేరు మర్చి మళ్ళీ పర్మిషన్ ఇస్తున్న డిఎంహెచ్వో నిర్లక్ష్యంతోనే పుట్టగొడుగుల తుర్కపల్లి మండలంలో నర్సింగ్ హోమ్లు వెలుస్తున్నాయని ఎంపీపీ భూక్య సుశీల రవీందర్ నాయక్ అన్నారు ఆదివారం తుర్కపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ
యాదాద్రి భువనగిరి జిల్లా, తుర్కపల్లి మండలం లో డి మ్ హె ఓ నిర్లక్ష్యం వల్ల పుట్టగొడుగుల పుట్టుకొస్తున్న నర్సింగ్ హోమ్, సీజ్ చేసిన హాస్పిటల్ కి పేరు మర్చి మళ్ళీ పర్మిషన్ ఇవ్వటం తో నర్సింగ్ హోమ్ నిర్వాహకులు పరిమితి కి సరిపోని సర్జరీలు, లింగనిర్దారణ చేయటం వలన బృన హత్యలు జరుగున్నావని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ పమేల సత్పతి స్నేహిత ప్రోగ్రామ్ లు చేస్తున్నపటికి, ప్రభుత్వం ఆడపిల్ల ల కోసం ప్రత్యేక పథకాలు అమలు చేసినప్పటికీ ఆడపిల్లలని పుట్టగానే వదిలేస్తున్నా రని అన్నారు గత సంవత్సరం నడిరోడ్డు పైన చనిపోయిన పిండాన్ని పందులు తినడం శనివారం రోజున వెంకటాపూర్ దత్తాయపల్లి మధ్యలో  ముండ్లపదల్లో ఆడపిల్లను వదిలిపెట్టిన దృశ్యం  నర్సింగ్ హోమ్ లో  అరాచకాలకు నిదర్శనమని అన్నారు కలెక్టరు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నర్సింగ్ హోమ్ లను బందు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ సింగిరెడ్డి నరసింహారెడ్డి టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పిన్నపురెడ్డి నరేందర్ రెడ్డి వెంకటాపురం సర్పంచ్ కల్లూరు ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..