యుఎస్‌ ఓపెన్‌ సెవిూస్‌లో అజరెంకా

వర్షంతో వాయిదా పడిన పలు మ్యాచ్‌లు
న్యూయార్క్‌ ,సెప్టెంబర్‌ 5 : ఏడాది చివరి గ్రాండ్‌శ్లామ్‌ టోర్నీలో టాప్‌ సీడ్‌ విక్టోరియా అజరెంకా తన జోరు కొనసాగిస్తోంది. క్వార్టర్‌ ఫైనల్‌లో అజరెంకా 6-1 , 4-6 , 7-6 తేడాతో ఆస్టేల్రియా క్రీడాకారిణి సమంత స్టోసర్‌పై గెలిచి సెవిూస్‌కు దూసుకెళ్ళింది. ¬రా¬రీగా సాగిన ఈ మ్యాచ్‌ అభిమానులకు అసలైన టెన్నిస్‌ విందును అందించింది. ఫేవరెట్‌గా బరిలోకి దిగిన అజరెంకా మొదటి సెట్‌ను సునాయాసంగా గెలుచుకుంది. అయితే రెండో సెట్‌లో మాత్రం సమంస స్టోసర్‌ అద్భుతంగా పుంజుకుంది. ప్రారంభంలో వెనుకబడినా… చక్కని స్టోక్ర్‌ ప్లేతో ఆధిక్యం సాధించి స్కోర్‌ సమం చేసింది. నిర్ణయాత్మకైన మూడో సెట్‌ మరింత ¬రా¬రీగా సాగింది. ఇద్దరూ తమ సర్వీస్‌ నిలుపుకోవడంతో టై బ్రేక్‌ తప్పలేదు. టై బ్రేక్‌ కూడా నువ్వా నేనా అన్నట్టు జరగడంతో మ్యాచ్‌ ఫలితంపై ఉత్కంట రేగింది. చివరకి అజరెంకానే పై చేయి సాధించి సెవిూస్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. మరోవైపు వరుణుడు అంతరాయం కలిగించడంతో చాలా మ్యాచ్‌లు వాయిదా పడ్డాయి. షరపోవా , మరియన్‌ బర్తోలీ మధ్య జరుగుతోన్న మరో క్వార్టర్‌ ఫైనల్‌ వర్షం అడ్డంకిగా నిలిచింది. మ్యాచ్‌ నిలిచిపోయే సమయానికి షరపోవా 0-4తో మొదటి సెట్‌లో వెనుకబడి ఉంది. అలాగే జొకోవిచ్‌ , వావ్‌రింకా మధ్య సాగుతోన్న పురుషుల సింగిల్స్‌ ప్రీ క్వార్టర్‌ ఫైనల్‌ కూడా ఆరంభంలోనే నిలిచిపోయింది. అప్పటికి జొకోవిచ్‌ మొదటి సెట్‌లో 2-0 ఆధిక్యంలో ఉన్నాడు. ఆండీ రాడిక్‌ , మార్టిన్‌ డెల్‌పొట్రో ¬రా¬రీ ప్రీ క్వార్టర్స్‌కు కూడా వాయిదా పడింది. మ్యాచ్‌ నిలిచిపోయే సమయానికి తొలి సెట్‌లో ఇద్దరూ 6-6 స్కోర్‌తో సమంగా ఉన్నారు. ఈ పరిణామాలతో ఆటగాళ్ళ చిరాకుపడుతున్నారు.. దీనితో పాటు స్టేడియం పైకప్పు నిర్మాణం మరోసారి చర్చకు వచ్చింది. టోర్నీ మొదటి నుండీ వరుణుడు ఆటంకం కలిగిస్తూనే ఉండడంతో పై కప్పు తప్పనిసరిగా నిర్మించాలని ఆటగాళ్ళు , విశ్లేషకులు చెబుతున్నారు. అటు నిర్వాహకులు మాత్రం నిర్మాణంపై ఖచ్చితమైన హావిూ ఇవ్వలేకపోతున్నారు. పై కప్పు నిర్మించాలంటే భారీ మొత్తం వెచ్చించాల్సి రావడమే దీనికి కారణంగా తెలుస్తోంది.