యుద్ధం మొదలైంది
` కేంద్రం దిగొచ్చేవరకు పోరు ఆగదు
` అంతం కాదిది ఆరంభం మాత్రమే
` ఇక మున్ముందు మరిన్ని పోరాటాలు
` ప్రజల కోసం ఎందాకైనా కొట్లాడుతాం
` తెలంగాణ పోరాటాల గడ్డ..విప్లవాల గడ్డ
` అవసరమైతే ఢల్లీి వరకు పోరాటం సాగిస్తాం
` అన్నం పెట్టే స్థాయికి ఎదిగిన తెలంగాణపై కేంద్రం కుట్ర
` కేంద్ర విధానాలు తెలంగాణ రైతాంగానికి అశనిపాతం
` కేంద్రం వడ్లు కొంటుందా లేదా తేల్చిచెప్పాలి
` ధర్నాచౌక్ మహాధర్నాలో సీఎం కేసీఆర్
హైదరాబాద్,నవంబరు 18(జనంసాక్షి):ధాన్యంకొనుగోళ్లు లక్ష్యంగా సిఎంకెసిఆర్ కేంద్రంపై యుద్దం ప్రకటించారు. అంతం కాదిది ఆరంభం మాత్రమే.. కాచుకోండని బిజెపి నేతలకు సవాల్ చేశారు. ధాన్యం కొనుగోళ్లతో బిజెపి పాలన ఏ పాటిదో తెలిసిందన్న సిఎం కెసిఆర్.. ఎందాకైనా వెళతామని ప్రకటించారు.
తెలంగాణ రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు టీఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన రైతుల మహాధర్నాకు సంఫీుభావంగా విచ్చేసిన పార్టీ ప్రజాప్రతినిధులందరికీ సీఎం కేసీఆర్ స్వాగతం తెలిపారు. ఇందిరా పార్కు వద్ద చేపట్టిన రైతు మహాధర్నాలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ధర్మంగా, న్యాయంగా వ్యవసాయం చేసి దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగింది. కేంద్రం విధానాల వల్ల మన రైతాంగం దెబ్బతినే అవకాశం ఉంది. నేటి కేంద్ర ప్రభుత్వం రైతాంగం, వ్యవసాయం పట్ల విముఖతను కలిగి ఉన్నది. కేంద్ర వైఖరి మార్చుకోవాలని, రైతు నిరంకుశ చట్టాలను విరమించుకోవాలని, కరెంటు బకాయిల విూటర్లు పెట్టే విధానాన్ని మార్చుకోవాలని అనేకసార్లు చెప్పాం. కానీ కేంద్రం నుంచి స్పందన లేదు. ఈ నేపథ్యంలోనే కేంద్రంపై యుద్దానికి శ్రీకారం చుట్టాం. ఈ యుద్ధం ఈరోజుతో ఆగిపోదు. ఇది ఆరంభం మాత్రమే. అంతం కాదు. మన హక్కులు సాధించే వరకు, రైతుల ప్రయోజనాలు పరిరక్షించబడే వరకు, ఉత్తర భారతదేశంలోని రైతుల పోరాటలను కలుపుకొని భవిష్యత్‌లో ఉధృతం చేయాల్సి ఉంటుందన్నారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తున్నాం. కేంద్రానికి మన రైతుల గోసలను, బాధలను విన్నవించాం. పంజాబ్‌లో ధాన్యం కొనుగోలు చేసినట్టే తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రానికి చేతులెత్తి దండం పెట్టాం. కానీ కేంద్రం నుంచి స్పందన లేదు. నిన్న స్వయంగా ప్రధాని మోదీకి లేఖ రాశాను. కానీ ఉలుకు పలుకు లేదు. మన బాధ ప్రపంచానికి, దేశానికి తెలియాలని చెప్పి ఈ ధర్నాకు శ్రీకారం చుట్టామన్నారు. తెలంగాణ గ్రామాల్లో కూడా వివిధ రూపాల్లో పోరాటాలను ఎంచుకుంటాం. ముందుకు కొనసాగుతూనే ఉంటాం. కేంద్రం దిగివచ్చి మన రైతాంగానికి న్యాయం చేసే వరకు పోరాటం కొనసాగుతూనే ఉంది. ఈ ఉద్యమాన్ని ఉప్పెనలా కొనసాగిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. అద్భుతమైన పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నాం. ఈ క్రమంలో ఈ రోజు తెలంగాణ రైతాంగం ఉత్పత్తులను కొనుగోలు చేయాలని, రైతుల ప్రయోజనాలను రక్షించుకోవాలని ఈ యుద్దాన్ని ప్రారంభించాం అని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇందిరా పార్క్ వద్ద టీఆర్‌ఎస్ మహాధర్నాలో కేసీఆర్ ప్రసంగించారు. హైదరాబాద్ నగరంతో ప్రారంభమైన ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదన్నారు. అవసరమైతే ఢల్లీి వరకు కూడా యాత్ర చేయాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. ఎక్కడిదాకా అయినా సరే పోయి మన ప్రజల ప్రయోజనాలను రక్షించుకోవాలి. తెలంగాణ పోరాటాల గడ్డ, విప్లవాల గడ్డ. తనను తాను రక్షించుకోవాలనో తెలుసు. పరాయి పాలకుల విష కౌగిలి నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే స్వేచ్ఛా వాయువులు పీల్చుకొని ఒక అద్భుతమైన పద్ధతిలో ముందుకు పోతున్నాం. తెలంగాణ రైతాంగానికి అశనిపాతంలాగా ఈ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు దాపరిస్తున్నాయి. వాటిని ఎదర్కోవడానికి, కండ్లు తెరిపించడానికీ ఈ యుద్దానికి శ్రీకారం చుట్టామన్నారు. ఈ దేశాన్ని నడిపించే నాయకులు చాలా సందర్భాల్లో వితండవాదాలు చేశారు. ఇటీవల నియోజకవర్గాల్లో జరిపిన ధర్నాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు కూర్చున్నారు. ప్రభుత్వమే ధర్నాకు కూర్చుంటుందా? అని ప్రశ్నించారు. 2006లో గుజరాత్ సీఎం, నాటి ప్రధాని మోదీ 51 గంటలు సీఎం హోదాలో ధర్నాకు కూర్చున్నారు. ఆయన పీఎం అయిన తర్వాత ధర్నాలు చేసే పరిస్థితులు కల్పించారు. సీఎంలు, మంత్రులు ధర్నాలో కూర్చునే పరిస్థితి మోదీ విధానాల వల్లనే వచ్చింది. కేంద్రం సమస్యను పరిష్కరిస్తే ధర్నాల అవసరం ఉండదు. ఈ పోరాటం భవిష్యత్‌లోనూ కొనసాగుతోంది అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. పంజాబ్‌లో ధాన్యం కొనుగోలు చేసినట్టే తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రానికి చేతులెత్తి దండం పెట్టామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. కేంద్రం విధానాల వల్ల మన రైతాంగం దెబ్బతినే అవకాశం ఉంది. కేంద్ర, రైతు నిరంకుశ చట్టాలను విరమించుకోవాలని, కరెంటు విూటర్లు పెట్టే విధానాన్ని మార్చుకోవాలని అనేకసార్లు చెప్పాం. రైతుల ప్రయోజనాలు పరిరక్షించుకోవాడినికి, ఉత్తర భారతదేశం లోని రైతుల పోరాటలను కలుపుకొని భవిష్యత్‌లో యుద్ధం చేయాల్సి ఉంటుందన్నారు. కేంద్రానికి మన రైతుల గోసలను, బాధలను విన్నవించాం. నిన్న స్వయంగా ప్రధాని మోడీకి లేఖ రాశాను. కానీ కేంద్రం నుంచి స్పందన లేదు. మన బాధ ప్రపంచానికి, దేశానికి తెలియాలని చెప్పి ఈ ధర్నాకు శ్రీకారం చుట్టాం. ఇది ఆరంభం మాత్రమే. అంతం కాదు. రానున్న రోజుల్లో గ్రామాల్లో కూడా ప్రజల హక్కు కాపాడేందుకు వివిధ రూపాల్లో పోరాటాలను ఎంచుకుని ముందుకు కొనసాగుతూనే ఉంటాం. కేంద్రం దిగివచ్చి మన రైతాంగానికి న్యాయం చేసే వరకు పోరాటం కొనసాగిస్తాం అని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. ఈ ధర్నాలో ముఖ్యమంత్రి కెసిఆర్ తోపాటు మంత్రులు,ఎంపిలు,ఎమ్మెల్సీలు, టిఆర్‌ఎస్ నాయకులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు ఇందిరాపార్క్ వద్దకు భారీగా తరలి వచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహా మంత్రివర్గం, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రైతుబంధు సమితి బాధ్యులు, జడ్పీ చైర్మన్లు, మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు మాత్రమే ఈ మహా ధర్నా రావాలని నిర్ణయించినప్పటికి రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా ధర్నాచౌక్‌కు తరలివచ్చారు. మహాధర్నా ఏర్పాట్లు అసాధారణ రీతిలో చేశారు. వేదిక విూద సీఎం కేసీఆర్, మంత్రులు, వేదిక ముందు ఒక కంపార్ట్‌మెంట్లలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల బాధ్యులు, మరో కంపార్ట్‌మెంట్లలో కార్పొరేషన్ చైర్మన్లు, రాష్ట్ర స్థాయి నేతలకు మరో కంపార్ట్‌మెంట్.. ఆ తర్వాత ఇతరులు కూర్చొనే విధంగా ఏర్పాట్లు చేశారు.
తెలంగాణలో పండిరచే వడ్లు కొంటరా..? కొనరా..?
తెలంగాణలో పండిరచే వడ్లు కొంటరా..? కొనరా..? సూటిగా అడుగుతున్నామని సిఎం కెసిఆర్ కేంద్రాన్ని ప్రశ్నించారు. టిఆర్‌ఎస్ మహాధర్నా ముగింపు ఉపన్యాసంలో ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనమని చెప్పమంటే.. మేం మరాఠీలో అడిగామా? ఉర్దూలో అడిగామా? అర్థం కాని భాషలో అడిగామా? అని కేసీఆర్ ప్రశ్నించారు. రైతులకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒకటే మాట.. ఏం జరుగుతోంది. ఏంది గడబిడి ఇది. లొల్లి ఏంది అసలు. ఒకటే ఒక మాట. సాఫ్ సీదా ముచ్చటఅంటూ కేంద్రాన్ని నిలదీసారు. బీజేపీ నాయకులు వంకర టింకర మాటలు మాట్లాడుతున్నారు. ఈ గోస ఒక తెలంగాణలోనే లేదు. భారతదేశం మొత్తంలో ఉంది. ఒక ఏడాది కాలం నుంచి ఢల్లీి సరిహద్దుల్లో వేల లక్షల మంది రైతులు వరుస నిరాహార ధీక్షలు చేస్తున్నారు. పంటలు పండిరచే శక్తి లేక కాదు. కేంద్రం తెచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం తన విధానాలు మార్చుకోకుండా అడ్డగోలుగా మాట్లాడుతోంది. ఈ దేశాన్ని నడపడంలో అన్ని పార్టీల ప్రభుత్వాలు దారుణంగా విఫలం చెందాయి. పంటలు కొనడానికి విూకు భయం అవుతుంది. బాధ అవుతుంది. అడ్డగోలుగా మాట్లాడటం కాదు.. గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో భారత్ 101వ స్థానంలో ఉంది. ఇంతకన్న సిగ్గుచేటు ఏమైనా ఉంటదా? దేశంలో 12 కోట్ల మంది రైతుల ఉన్నారు. 40 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అద్భుతమైన నదులున్నాయి. బంగారు పంటలు పండే అవకాశాలు ఉన్నాయి. దాదాపు సగం మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి బతుకుతున్నారు అని సీఎం కేసీఆర్ తెలిపారు. మేం పోరాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుని, చెరువులను బాగు చేసుకుని, చెక్‌డ్యాంలు కట్టి, కరెంట్ ఇచ్చి రైతులను బాగు చేసుకున్నాం. పంటలు పండిరచుకున్నాం. ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసే బాధ్యత కేంద్రానిదే. కానీ నిర్లక్ష్యం వహిస్తోంది. రైతాంగాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. హంగర్ ఇండెక్స్‌లో భారత్ ఆకలి రాజ్యం అని తెలుస్తోంది. దేశంలో ఏ మూలలో ఆహార కొరత ఉందో సమన్వయం చేయాలి. అవసరమైతే డబ్బులు ఖర్చు పెట్టి ఆహారం అందించాలి. సమస్య ఉన్నదంతా కేంద్రం వద్దే. కేంద్రం విూద యుద్ధం ప్రారంభమైంది. ఉత్తర భారత రైతాంగం కేంద్రానికి నిరసన వ్యక్తం చేస్తోంది. రైతుల జీవితాలపై చెలగాటమాడుతోంది. కార్లతో తొక్కి చంపుతోంది. ఇవాళ తెలంగాణ రైతులపై బీజేపీ నేతలు కన్నేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద విధ్వంసం సృష్టిస్తున్నారు. రైతులను బతకనిస్తారా? బతకనివ్వారా? అని కేసీఆర్ ప్రశ్నించారు. దిక్కు మాలిన కేంద్ర ప్రభుత్వం విధానాల వల్లే రైతులు నష్టపోతున్నారు. వడ్లు వేయాలి.. మెడలు వంచి కొనిపిస్తాం అని బీజేపీ నేతలు అంటున్నారు. ఈ దేశాన్ని పాలించే బీజేపీ అడ్డగోలు అబద్దాలు మాట్లాడుతున్నారు. ఫేస్ బుక్, వాట్సాప్‌లలో వితండవాదాలు సృష్టిస్తున్నారు అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కరెంట్ మోటర్లకు విూటర్లు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఇక గవర్నర్‌కు వినతిపత్రం ఇచ్చాక తదుపరికార్యాచరణ చేస్తామని ప్రకటించారు.