యేడాది అంతానికి నగదు బదిలీ

రాయితీ వంటగ్యాస్‌కు అమలు
ఆర్థిక మంత్రి చిదంబరం
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 6 (జనంసాక్షి) :
నగదు బదిలీ పథకాన్ని ఈ ఏడాది చివరికల్లా ప్రవేశపెడతామని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం తెలిపారు. శనివారం మధ్యాహ్నం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ రాయితీ వంటగ్యాస్‌ పంపిణీకి నగదు బదిలీ పథకాన్ని అమలు చేయనున్నామని చెప్పారు. దీనిపై త్వరలో పెట్రోలియం మంత్రిత్వ శాఖతో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. చక్కెర నియంత్రణ ఎత్తివేయడంతోపాటు పరిశ్రమలు, రైతులకు లాభం చేకూరుతుందని తెలిపారు. చక్కెర నియంత్రణ ఎత్తివేతతో వార్షిక రాయితీ రూ. 2,500 కోట్ల నుంచి 2,600 కోట్లకు చేరుకుంటుందని తెలిపారు.
ఈ ఏడాది 50 లక్షల మంది ప్రజలు అదనంగా పన్ను చెల్లించినట్లు చెప్పారు. ఈ ఏడాది జీడీపీ వృద్ధి రేటు 6 శాతం సాధిస్తామని చిదంబరం వివరించారు.